వార్తలు

Soil Health Card: సాయిల్ హెల్త్ కార్డ్ పథకం ప్రయోజనాలు

0
Soil Health Card Scheme

Soil Health Card: సాయిల్ హెల్త్ కార్డ్ పథకం 7 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ రోజున అంటే 2015 ఫిబ్రవరి 19న రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. గత 7 ఏళ్లలో దాదాపు 23 కోట్ల మంది రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం, 2015లో ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు 23 కోట్ల మంది రైతులకు సాయిల్ హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. ఇది నేల పోషణను పెంచడమే కాకుండా పంట ఉత్పాదకతను కూడా పెంచుతుంది.

Soil Health Card Scheme

                   Soil Health Card Scheme

కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ ఈ పథకం యొక్క 7 సంవత్సరాలు విజయవంతమైన మరియు అద్భుతమైనదిగా పేర్కొన్నారు. రైతుల చిత్రపటాన్ని, అదృష్టాన్ని మార్చేసిందన్నారు. సాయిల్ హెల్త్ కార్డు వల్ల రైతుల దిగుబడి, ఆదాయం పెరగడమే కాకుండా వారి జీవితాల్లో ఆనందాన్ని నింపింది.

Soil Health Card Scheme

ఈ పథకం వల్ల భూసారానికి పెద్దపీట వేసి రైతులు సాధికారత సాధించారన్నారు. సాయిల్ హెల్త్ కార్డు వల్ల రైతుల్లో మట్టి నాణ్యతపై అవగాహన పెరిగింది. దీని సహాయంతో దిగుబడిని పెంచడానికి సరైన పంటను ఎంచుకోవడంలో రైతులకు సహాయపడింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా 11 వేల 531 కొత్త భూసార పరీక్ష ల్యాబ్‌లు ప్రారంభించబడ్డాయి. దీని కారణంగా నేల విశ్లేషణ సామర్థ్యం సంవత్సరానికి 1.78 కోట్ల నుండి 3.33 కోట్ల నమూనాలకు పెరిగింది

farmers Soil Health Card

ఈ పథకం కిందా రైతులకు సాయిల్ హెల్త్ కార్డులను జారీ చేయడం ద్వారా వారు తమ పొలాల్లోని మట్టిలో ఏమి లోపిస్తున్నారో తెలుసుకోవచ్చు. ఇది రైతుల దిగుబడిని పెంచడం మరియు స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా అదనపు ఆదాయాన్ని నిర్ధారిస్తుంది. ఈ పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ రైతులు తమ నేల ఆరోగ్య స్థితిపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. నేల ఆరోగ్యంగా లేకుంటే ఉత్పత్తి పెరగదు.

Leave Your Comments

Farmers Success Story: క్యూ పద్ధతిలో వరి సాగు చేస్తూ లక్షల్లో ఆదాయం

Previous article

Soil Testing Procedure: మట్టి పరీక్షా విధానములో కర్బనము కనుగొనే ప్రక్రియ

Next article

You may also like