కర్ణాటక ఉద్యాన యాత్ర లో భాగంగా రెండవ రోజు శుక్రవారం బెంగుళూరు లాల్ భాగ్ లో ఉద్యాన రైతుల సహకార సంస్ద హాప్ కామ్స్, మదర్ డైరీ,సఫల్ యూనిట్లు,తిరుమ్ షెట్టి హల్లిలో రైతు ఆనంద రెడ్డి వ్యవసాయ క్షేత్రం సందర్శించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి గారు,ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రాం రెడ్డి గారు,కొండా లక్ష్మణ్ బాపూజీ విశ్వ విద్యాలయం వీ సీ నీరజా ప్రభాకర్ గారు, కర్ణాటక ఉద్యాన శాఖ డీడీ కె.ఎం పరాశివమూర్తి
- శంషాబాద్ విమానాశ్రయం నుండి కూరగాయల ఎగుమతులకు చర్యలు.
- జీ.ఎం.ఆర్ సంస్దతో సమావేశం ఏర్పాటు చేయండి.
- హైదరాబాద్ నలువైపులా మార్కెట్లు రావాలి.
- శంషాబాద్,వంటి మామిడి,ఇబ్రహీంపట్నం లలో రైతు సహకార సంస్ద మార్కెట్లు ఏర్పాటు చేయాలి.
- దళారీ వ్యవస్ద పోయి రైతులు,వినియోగదారులకు నేరుగా సంబంధాలు ఏర్పడాలి.
- అప్పుడే రైతుల శ్రమకు గిట్టుబాటు ధరతో పాటు,వినియోగదారులకు సరసమైన ధరలకు పండ్లు,కూరగాయలు నాణ్యమైనవి అందుతాయి.
- కర్నూల్,హైదరాబాద్ జాతీయ రహదారిపై అగ్రి ఫుడ్ ప్రాసెసింగ్ ఎగుమతి యూనిట్ ఏర్పాటు చేయండి…ప్రభుత్వ సహకారం అందిస్తాయి.
- మదర్ డైరీ,సఫల్ యూనిట్ల ఉత్పత్తులు ఎంతో బాగున్నాయి.
- తెలంగాణలో ఇలాంటి యూనిట్లు ఏర్పాటు చేయాలి.రైతులతో నేరుగా సంస్దలే సంబంధాలు నెరపాలి.
- ఆ ఉద్దేశంతోనే బీచుపల్లి లో వేరుశనగ నూనె ఉత్పత్తి కేంద్రం,అశ్వారావు పేటలో ముడి ఆయిల్ పామ్ ఉత్పత్తికి ఆదేశాలివ్వడం జరిగింది.
- రైతు సహకార సంఘాలు,రైతు ఉత్పత్తి కేంద్రాల విషయంలో ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ గారు ఎంతో ముందు చూపుతో ఉన్నారు.
- రైతుబంధు సమితిలు,రైతువేదికలతో తెలంగాణ వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయి.
- కర్ణాటక ఉద్యాన యాత్ర లో భాగంగా రెండవ రోజు శుక్రవారం బెంగుళూరు లాల్ భాగ్ లో ఉద్యాన రైతుల సహకార సంస్ద హాప్ కామ్స్, మదర్ డైరీ,సఫల్ యూనిట్లు,తిరుమ్ షెట్టి హల్లిలో రైతు ఆనంద రెడ్డి వ్యవసాయ క్షేత్రం సందర్శించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి గారు,ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రాం రెడ్డి గారు,కొండా లక్ష్మణ్ బాపూజీ విశ్వ విద్యాలయం వీ సీ నీరజా ప్రభాకర్ గారు, కర్ణాటక ఉద్యాన శాఖ డీడీ కె.ఎం పరాశివమూర్తి
Leave Your Comments