Agricultural Pump: మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (MSEDCL) షోలాపూర్ జిల్లాలో విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. దీంతో వ్యవసాయ పంపులపై తీవ్ర ప్రభావం పడింది. ఇదే సమయంలో చివరి దశలో ఉన్న అరటి తోటలకు నీరు అందక నాసిరకం అవుతున్నాయని రైతులు వాపోతున్నారు. కొన్నిసార్లు వాతావరణంలో మార్పులు, మరికొన్ని సార్లు ప్రభుత్వం విధానాల వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నామని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అరటిపండు ఉత్పత్తిలో ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. జిల్లాలో ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉంది. అంతేకాకుండా, సమృద్ధిగా నీటి వసతి మరియు అరటికి మంచి ధర ఉన్నప్పటికీ అరటి తోటలు ఇబ్బందుల్లో ఉన్నాయి. కాగా.. జిల్లాలోని ఉజని ఆనకట్ట సమీపంలోని భూమి విస్తీర్ణంలో అరటిని పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు.

Agricultural Pump
ఇప్పటి వరకు అరటి రైతులు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవలసి వచ్చింది, అరటితోట వ్యాధి కారణంగా వాతావరణ మార్పుల వల్ల ప్రభావితమైంది, అయినప్పటికీ రైతులు ఈ సమస్యలన్నింటినీ ఎదుర్కొని అరటి తోటలను సాగు చేసారు. అయితే ఇప్పుడు అంతా బాగానే ఉన్నప్పటికీ ప్రభుత్వ చర్య వారిని కలవరపెడుతుంది. .దీంతో తోటలను కాపాడుకునేందుకు రైతులు అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు విద్యుత్ పంపిణీ సంస్థ రైతులకు ఇబ్బందిగా మారింది.
Also Read: యూకలిప్టస్ సాగులో మెళకువలు

Banana Cultivation
నిజానికి జనవరి నాటికి అరటి ధరలు తగ్గుముఖం పట్టాయి. జలానా జిల్లాలో ఉత్పత్తి వ్యయం పెరగడం, తెగుళ్ల ప్రభావంతో చాలా మంది రైతులు తమ తోటలను నరికివేయాల్సి వచ్చింది. ప్రస్తుతం వేసవి వచ్చిందంటే ధరలు మెరుగవుతున్నాయి. క్వింటాల్‌కు 900 నుంచి 1100 చొప్పున విక్రయించి రైతులకు నాలుగు పైసలు వస్తాయని ఆశించగా, విద్యుత్ పంపిణీ సంస్థ కఠినంగా వ్యవహరించడంతో రైతు నిస్సహాయంగా మారాడు.

Banana Crop
రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ పంపిణీ సంస్థ నుంచి రికవరీ జరుగుతోందని ప్రచారం సాగుతోంది. అత్యధికంగా వ్యవసాయ పంపకాల బకాయిలు.. రైతులు ప్రతిసారీ దిగుబడి తీసుకున్నా బకాయిలు చెల్లించడం లేదని విద్యుత్తు పంపిణీ సంస్థ అధికారులు చెప్తున్నారు. అయితే విద్యుత్ సరఫరా నిలిచిపోకముందే సంబంధిత రైతులకు ముందస్తు సమాచారం ఇచ్చినా బకాయిల చెల్లింపును రైతులు పట్టించుకోవడం లేదన్నారు. ఈ విద్యుత్ పంపిణీ సంస్థ కూడా రైతులదేనని, రైతుల చేతుల్లోనే ఉందని, రైతులు కూడా బిల్లు చెల్లించి ప్రభుత్వానికి సహకరించాలని అధికారులు పేర్కొంటున్నారు.దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు తెలిపారు.
Also Read: వ్యవసాయ వ్యర్థాలతో రైతులకు సిరులు