మత్స్య పరిశ్రమమన వ్యవసాయంవార్తలు

వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం డబ్బులను విడుదల చేసిన ఏపీ ముఖ్యమంత్రి..

0

కరోనా కష్ట సమయంలో ఏపీ సీఎం మనసు చాటుకుంటున్నారు. వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం డబ్బులను ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. మంగళవారం ఉదయం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు జమ చేశారు. సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనిచ్చే ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది కూడా విడుదల చేసింది.
ఈ పథకం కింద అర్హత గల వారిని ఒక్కరిని కూడా వదలకుండా అందరి ఖాతాల్లో ఈ డబ్బులను జమ చేసింది ప్రభుత్వం. ఇందులో మొత్తం 1,19,875 కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున రూ. 119,87,50,000 మేర లబ్ధి కలగనుంది. ఇక గడచిన రెండేళ్లలో మత్స్యకారులకు రూ. 211.71 కోట్ల మేర లబ్ధి కలిగింది. ఈ ఏడాది మరో రూ. 119.87 కోట్లతో కలిపి మూడేళ్ళలో రూ. 331.58 కోట్ల మేర లబ్ధి చేకూరుతుంది. అయితే గతంలో రూ. 4 వేల చొప్పున మాత్రమే ఇచ్చిన భృతి మొత్తాన్ని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 వేలకు పెంచింది. రెండెళ్లుగా ఏటా క్రమం తప్పకుండా వేట నిషేధ సమయంలోనే భృతిని అందజేస్తూ మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది.

Leave Your Comments

రైతులకు సేవలందించేందుకు నాపంట పేరుతో ప్రత్యేక వేదిక..

Previous article

వానాకాలం సాగుపై సమాయాత్తంపై టీ సాట్ లో రైతులతో ముఖాముఖిలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు..

Next article

You may also like