Tomato linked with Aadhar Card: దేశవ్యాప్తంగా టమోటా రైతులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో టమోటా కు రెక్కలు వచ్చాయి. రైతులు పంటను కాపాడుకోవడానికి పోలీసులను, సెక్యూరీటిని కాపాలా పెట్టుకుంటున్నారు అంతేకాకుండా. సీసీ కెమోరాలు కూడా పెట్టారు. మరొక కొత్త పద్ధతిలో నైలాన్ తెరలు కూడా కట్టారు మరీ.. టమాటా పంటను కాపాడుకోవడానికి రైతులు ఇన్ని తిప్పలు పడాల్సి వస్తుంది. టమాటా ధరలు చిరుత కంటే వేగంగా పరుగెడుతున్నాయి. పలుచోట్ల కిలో టమోటా రూ.130 నుంచి 150 కూడా పలుకుతున్నాయి. టమాటాకు రోజురోజుకు రేట్లు పెరుగుతుండటంతో సామాన్య జేబులకు చిల్లులు పడుతున్నాయి.
అది మన ప్రభుత్వ రూల్
అయితే ఆధార్ లింక్ చేయండి..? అంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారు. రైతుబజార్లకు వెళ్లి టమాటాలను తెచ్చుకోవాలంటే కచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలని చెబుతున్నారు. అయితే అక్కడ ఆధార్ తప్పనిసరి అని బోర్డు కూడా పెట్టారు. అది కూడా ఒక కార్డుకి కేవలం ఒక కేజీ మాత్రమే అని పెట్టారు. బ్యాంకు, పాన్, ఐడెంటిటీ. ఇవన్నీ కావాలంటే వాటికి ఒక్కటే పరిష్కారం అది ఆధార్ కార్డు మాత్రమే ఈరోజు, రేపు ఏ పని కావాలన్నా ముందుగా ఆధార్ కార్డు ముఖ్యం. పాన్ కార్డుకు ఆధార్ లింక్, అకౌంట్లకు ఆధార్ లింక్ అన్నింటికి అదే ఉండాలి. మరి టమాటాకు కూడా ఆధార్ లింకు ఏమిటి అని అందరికీ సందేహం రావచ్చు. ఇదేంటండీ అంటే అది ప్రభుత్వ రూల్. రైతు బజార్లలో సబ్సిడీ పై టమాటాను కొనాలంటే ఆధార్ ఇలా చూపించాల్సిందే అని నిర్వాహకులు చెబుతున్నారు.
Also Read: Modern Agricultural Equipment: ఆధునిక వ్యవసాయ పరికరాలు.!
రైతుబజార్లకి జనం పరుగులు
విశాఖలో ఎక్కడ చూసినా రైతు బజార్లలో ఆధార్ కార్డులు పట్టుకొని తిరుగుతున్న వినియోగదారులు మాత్రమే కనిపిస్తారు. ఎందుకంటే అక్కడ టమాటా ఉంది కాబట్టి. ఆధార్ ఇస్తేనే కేజీ టమాటా దొరుకుతుంది. లేదంటే వంద రూపాయలు పెట్టి మార్కెట్లో కిలో తెచ్చుకోవాల్సిందే. బయట మార్కెట్లో అయితే టమాటా రెండొందలు కూడా ఉంది. అందుకే రైతుబజార్లకే జనం పరుగులు తీస్తున్నారు. దాదాపు పది రైతు బజార్లు ఉన్నాయి. ఎంవీపీ, సీతమ్మధార, నరసింహనగర్ రైతు బజార్లులోనే ఎక్కువగా వినియోగదారుల తాకిడి కనిపిస్తుంది. ఇక టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ రైతుబజార్లు సామాన్యుడికి ఓపెద్ద రిలీఫ్ ను ఇచ్చాయి. దీంతో ఇక్కడికి వచ్చి టమాటాను 50 రూపాయలకు పొందవచ్చు. రైతుబజార్ల కి వెళ్తే ఇప్పుడు కచ్చితంగా ఆధార్ కార్డు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆధార్ లేకపోతే రేషన్ కార్డు అయినా తీసుకొని వెళ్ళాలి. అలా చేయకపోతే సబ్సిడీ టమాటా ఇవ్వరు.
ఆధార్ లేనిది అక్కడ దొరకదు.
కొందరు వినియోగదారులు తమ వద్ద ఏ కార్డు లేని సందర్భంలో ఉసూరు మనుకుంటూ వెనక్కి వెళ్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం టమాటా కి తప్పనిసరిగా ఆధార్ లింక్ ఉండాలని అంటున్నారు. ఆధార్ నెంబర్ ఇస్తేనే అది రాసుకుని టమాటాను అందిస్తున్నారు. అది కూడా కేజీ మాత్రమే ఎంతో కష్టపడి ఎండలో ఎండుతూ, వానలో తడుస్తున్న కేవలం కేజి మాత్రమే ఇస్తున్నారు, కొందరు తమ మొబైల్ ఫోన్లలో, స్మార్ట్ గా ఆధార్ ను చూపించి టమాటా తీసుకెళ్తున్నారు. ఇది తెలియక చాలామంది కార్డు తీసుకురాకుండా కవర్ తో వచ్చేస్తున్నారు. ఇకపై టమోటా కావాలంటే మాత్రం అదే సబ్సిడీ టమాటా కావాలంటే మాత్రం ఆధార్ కార్డు కచ్చితంగా ఉండాల్సిందే అని రైతు బజార్ల నిర్వాహకులు చెబుతున్నారు.
Also Read: Pulses Price Hike: పప్పులతో తిప్పలు తప్పవా భారీగా పెరగనున్న పప్పు ధాన్యాల ధరలు