Tomato Farmer Murder: టమాట ధర పెరుగుదల కొంత మంది రైతులకి ఆనందాన్ని ఇస్తుంటే మరి కొంత మంది రైతులకి మాత్రం ఏడ్పిస్తుంది. టమాట పంట పండించిన రైతులు వాళ్ళ పంటని సులువుగా అమ్ముకొని మంచి లాభాలు పొందుతున్నారు. టమాట పంట లాభాలతో రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. కానీ కొంత మంది రైతులు పండించిన టమాట పంటలు దొంగలు ఎత్తుకొని పోతున్నారు. టమాటో దొంగతనం ఒకటి అయితే మరొకటి టమాట రైతుల హత్య మరొక దారుణం. ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ జిల్లాలో మధుకర్‌రెడ్డి రైతుని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు.

He made 30 lakhs by selling tomatoes in the local market
వారం రోజులో ఆంధ్రప్రదేశ్, అన్నమయ జిల్లాలో ఇద్దరు టమాట రైతులను హత్య చేశారు. అన్నమయ జిల్లా పెద్ద తిప్ప సముద్రం దగ్గర ఆదివారం రాత్రి తన పొలం పంటకు కాపలాకు వెళ్లిన రైతు మధుకర్‌రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. ఈ వార్తతో టమాట సాగు చేసే రైతులు బయాందోళనగా ఉన్నారు.
Also Read: Tomato Price: కోటీశ్వరులు అవుతున్న టమాట రైతులు.!

Tomato Farmer Murder
ఈ ధరలు ఇంకా ఇలానే ఉంటే రైతులకి రక్షణ కల్పించాల్సి వస్తుంది. టమాట పంట దిగుబడి తగ్గడం, అకాల వర్షాలు వీటి వల్ల ధరలు పెరుగుతున్నాయి. పంట తక్కువ ధర ఉన్నపుడు దాచుకోవడానికి సరైన కోల్డ్ స్టోరేజీ లేకపోవడం. పంట సరైన ధర లేని సమయంలో కోల్డ్ స్టోరేజీ రైతులకి అందుబాటులో ఉంటే రైతులందరికి ఉపయోగంగా ఉంటుంది. ఎక్కువ ధర ఉన్న సమయంలో పంటని దాచుకొని అమ్ముకోవచ్చు.
Also Read: Tomato to Compete with Petrol Price:పెట్రోల్ తో పోటీపడుతున్న టమాటాలు..