Input Subsidy for AP Farmers: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు అల్లకల్లోలం అవుతున్నారు. అసలు ఎండాకాలం వానాకాలం అన్న తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు దంచికొడుతున్న ఈ వానలకు ఎన్నో వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పంట చేతికొచ్చే సమయంలో ఈ వడగండ్ల వానలు పడుతుండటం వల్ల రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చింది. రైతు భరోసాతో పాటు నష్టపోయిన రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ అందించేందుకు ముందుకు వచ్చింది. ఈ సందర్బంగా నష్టపోయిన రైతుల వివరాలు, పంట వివరాలను సేకరించవలసిందిగా ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి నష్టపోయిన పంట వివరాలను, రైతుల వివరాలను నమోదు చేయాల్సిందిగా సీఎం జగన్ గారు ఆదేశాలు జారీ చేశారు. సీఎం జగన్ గారు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నష్టపోయిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇటీవల కురిసిన వర్షాలకు చాలా చోట్ల వరిధాన్యం తడిసి మొలకలొచ్చాయి… అలాంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు సీఎం జగన్ గారు.
Also Read: Neera Health Benefits: నీరా తాగండి.. నిశ్చింతగా ఉండండి!
ఇక నాలుగో ఏడాది మూడో విడత వైఎస్సార్ రైతు భరోసా, పిఎం కిసాన్, ఇటీవల పంటలు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నిధుల్ని ఫిబ్రవరిలో బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసిన విషయం తెలిసిందే. ఈ రైతు భరోసా కేంద్రాల వల్ల రైతులకు ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయని, ఈ విషయం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఒకవేళ మీకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ రైతు భరోసా పథకం కింద నగదు అందకపోతే వెంటనే స్థానిక సచివాలయాల్లో సంబంధింత సిబ్బందిని కలిసి.. మీ పట్టాదారు పుస్తతకం, వ్యక్తిగత వివరాలను అందించాలి. వారు మీ వివరాలను ధృవీకరించి మీకు నగదు రాకపోవడానికి గల కారణాలను చెబుతారు లేదా మళ్లీ రైతు భరోసా నగదు అందేలా చర్యలు తీసుకుంటారు.
Also Read: Rythu Bandhu: రైతన్నలకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం… జూన్ నెలలో రైతుబంధు నగదు జమ!