AP Seeds Development Corporation ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ కి జాతీయ స్థాయి స్కాచ్ అవార్డ్ దక్కింది. రైతు సంక్షేమం విభాగంలో స్కాచ్ అవార్డ్ SKOCH Award కింద సిల్వర్ మెడల్ కైవసం చేసుకుంది. డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామీణ స్థాయిలో 20 లక్షల మంది రైతులకు విత్తనాలు అందజేసినందుకు గాను ఈ అవార్డు దక్కింది. సీజన్ ప్రారంభంలో సకాలంలో రైతులకు విత్తనాలు అందించడమే కాక నాణ్యతా పరీక్షలతో కూడిన మంచి విత్తనాలు అందించినందుకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది వరదలు, తుఫానులు సందర్భంలోనూ ఏపీ సీడ్స్ విత్తనాలు అందించడంలో ఏపీ సీడ్స్ సకాలంలో పనిచేసింది. AP Seeds Development Corporation
ఈ మేరకు ఏపి సీడ్స్ ఎండి డాక్టర్ శేఖర్ బాబు ఈ అవార్డుని అందుకున్నారు. నాణ్యమైన విత్తనాలు సకాలంలో అందించడంలో సంస్థ ఐటీ సాంకేతికతను కూడా వినియోగించడం వంటి అంశాలు ఈ అవార్డు ఎంపికాకు దోహదపడ్డాయి. నిర్ణీత సమయంలోనే విత్తనాలు పంపిణీ చేసినందుకు గుర్తింపు వచ్చిందన్నారు ఎండీ డాక్టర్ శేఖర్ బాబు. గ్రామ స్థాయిలో రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తన సరఫరా కు ఈ అవార్డు దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు.