International Year of Millets 2023: ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో గల సామాజిక విజ్ఞాన కళాశాల నందు అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం సందర్భంగా చిరుధాన్యాల పోషక విలువలు, ఆరోగ్యలాభాలపై పాఠశాల విద్యార్ధులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు . ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వెనిగండ్ల గ్రామం నుండి 9 మరియు 10వ తరగతి విద్యార్ధులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో డా. ఎమ్. యస్. చైతన్య కుమారి{ అసోసియేట్ డీన్} మాట్లాడుతూ చిరుధాన్యాలు అయిన రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, సామలు, వరిగెలు, అరికెలు, ఊదలు గురించి, వాటి పోషక విలువలు మరియు ఆరోగ్య లాభాల గురించి మాట్లాడుతూ శరీరానికి పెరుగుదల, శరీర నిర్మాణం, మధుమేహులకు చక్కెర మరియు కొలెస్ట్రాల్ నియంత్రించడమే కాకుండా ఎముకల ధృఢత్వం, బరువు తగ్గడం లకు కూడా తోడ్పడతాయని తెలియచేసారు. అంతే కాకుండా మనకి ఎక్కువగా దొరికేటటువంటి రాగులు, సజ్జలు, జొన్నలలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన మలబద్దకాన్ని నియంత్రిస్తూ రక్తహీనత నివారణకు ఉపయోగపడుతుందని తెలిపారు. తదుపరి చిరుధాన్యాల ఎగ్జిబిషన్ ద్వారా పోస్టర్స్ , చార్ట్స్ లైవ్ మోడల్స్ విద్యార్ధులకు చూపించడం జరిగింది.
Also Read: National Livestock Mission Subsidy Scheme: గొర్రెలు, మేకల పెంపకంపై రూ.50 లక్షల సబ్సిడి.!
సామాజిక విజ్ఞాన కళాశాల ఆధ్వర్యంలో నడుస్తున్న మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ లో ఉన్న చిరుధాన్యాల ప్రాసెసింగ్ మేషనరీ చూపిస్తూ ఈ ప్రాసెసింగ్ లో ముడి ధాన్యాలు అయిన రాగులు,జొన్నలు,సజ్జలు, సామలు, అరికెలను ప్రాసెసింగ్ పద్ధతిని వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్ధులకు ముడి రాగులను ప్రాసెసింగ్ చేయు పద్దతిని శ్రీమతి బి.అనురాధ, ఎన్ అనూష తెలియచేశారు. దీనిలో భాగంగా ముడి ధాన్యాలను ప్రాధమికంగా ప్రాసెసింగ్ చేసే యంత్రాలు అనగా destoner{రాళ్ళు తీసే యంత్రం }.dehuller{పొట్టు తీసే యంత్రం}, polisher{పాలిష్ చేసే యంత్రం} ను చూపించటం జరిగింది.
ఆ తర్వాత ద్వితీయ ప్రాసెసింగ్ పద్ధతిలో వాటి నుండి వివిధ రకాల పిండి, రవ్వ, అటుకులు తయారు చేసి, వాటి విలువ ఆధారిత ఉత్పత్తులను కూడా ప్రత్యక్ష పద్ధతిలో తయారు చేసే విధానాన్ని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్ధినులు వారి ఇంటర్న్షిప్ లో భాగంగా వారి అధ్యాపకురాలు డాll పద్మిని దేవి గోపిరెడ్డి ఆధ్వర్యంలో చిరుధాన్యాల న్యూట్రీబార్, రాగి చాక్లెట్, కొర్ర కేకు, జొన్న చెక్కలు, సామల పాయసం, రాగి మాల్ట్, రాగి చాక్లెట్ బిస్కెట్స్ మొదలైనటువంటి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారుచేసి విద్యార్ధులకు రుచి చూపించడం జరిగింది.
ఈ కార్యక్రమంలోపాఠశాలవిద్యార్ధులతో పాటు పాఠశాల ఉపాద్యాయు మరియు సామాజిక విజ్ఞాన కళాశాల బోధన సిబ్బంది మరియు విద్యార్ధులు పాల్గొని, కార్యక్రమంపై అభిప్రాయాలను కూడా తెలియచేసారు.
Also Read: Precautions of Paddy Crop: అకాల వర్షాల సమయంలో వరి పంటలో తీసుకోవలసిన జాగ్రత్తలు.!