Rainy Season Crops: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాలలోని వ్యవసాయ ఆర్థిక శాస్త్ర విభాగం, వ్యవసాయ మార్కెట్ ఇంటలిజెన్స్ కేంద్రం పంటల ధరలను అంచనా వేస్తుంది. దీనిని ఒక పరిశోధన పథకంగా వ్యవసాయ పంటల ముందస్తు ధరలను అంచనా వేయటానికి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆర్థిక సహాయంతో స్థాపించారు. ఈ కేంద్రం 2024-25 సంవత్సరం వానాకాలంలో సాగు చేసే వివిధ రకాల పంటల ముందస్తు ధరలు పంట కోత సమయంలో ఏ విధంగా ఉండనున్నాయో అంచనా వేసింది. రాష్ట్ర ప్రధాన మార్కెట్లలోని 6 నుంచి 22 సంవత్సరాల నెలవారి మోడల్ ధరలను తీసుకొని విశ్లేషణ చేశారు. ఈ విశ్లేషణ ఫలితాలు, మార్కెట్ సర్వేలను అనుసరించి 2024-25 వానాకాలం పంటకోత సమయంలో (సెప్టెంబర్-అక్టోబర్ మాసాల్లో)ధరలు ఏ విధంగా ఉంటాయో అంచనా వేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి …
వానాకాలం (ఖరీఫ్) పంట కోత సమయంలో వివిధ పంటల అంచనా ధరలు:
సెప్టెంబర్-అక్టోబర్ మాసాల్లో: జొన్నలు మహబూబ్ నగర్ మార్కెట్లో క్వింటాలుకు రూ. 2250-2450, సజ్జలు నిజామాబాద్ మార్కెట్లో క్వింటాలుకు రూ. 2010-2290, పెసర సూర్యాపేట మార్కెట్లో క్వింటాలుకు రూ. 7100-7400, మినుములు తాండూర్ మార్కెట్లో క్వింటాలుకు రూ.7240-7790, సోయాచిక్కుడు నిజామాబాద్ మార్కెట్లో రూ. 4550-4850 ఉండవచ్చని,అలాగే కూరగాయల ధరలు బోయినపల్లి మార్కెట్లో క్వింటాలుకు టమాటా రూ. 1250-1450, వంకాయలు రూ.1530-1760, బెండ రూ.1250-1550 చొప్పున ఉండవచ్చని అంచనా వేశారు.
ముందస్తు ధరల గురించిన మరింత సమాచారం కోసం ఫోన్: 9948780355, 9154828514, e mail : amic.pjtsau@gmail.com వారిని సంప్రదించి గాని, వెబ్ సైట్: https://pjtsau.edu.in/agri-marketing-intelligence.html ద్వారా గానీ పొందవచ్చు.
గమనిక: గత 20 సంవత్సరాల ధరలను విశ్లేషించి పైన తెలిపిన ధరలను వివిధ పంటల ముఖ్య మార్కెట్లలో అంచనా వేయడం జరిగింది. పంట రకం, నాణ్యత, అంతర్జాతీయ ధరలు, ఎగుమతి లేదా దిగుమతి పరిమితుల మూలంగా అంచానా ధరల్లో మార్పు ఉండవచ్చు. కావున భవిష్యత్లో పంటల ధరల మార్పునకు ఈ కేంద్రం ఏ విధమైన బాధ్యత వహించదు.ఇవి అంచనా ధరలు మాత్రమే అని గమనించాలి.
Also Read: Redgram: ఏయే కంది రకాలను రబీలో సాగుచేసుకోవచ్చు ?