ఆంధ్రప్రదేశ్

CM YS Jagan: వ్యవసాయ, ఉద్యానవనశాఖలపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష…

1
CM YS Jagan
AP CM YS Jagan

CM YS Jagan: ఖరీప్‌ సన్నద్ధతతో పాటు వ్యవసాయ అనుబంధశాఖల్లో చేపడుతున్న కార్యక్రమాల ప్రగతిని సీఎంకు అధికారులు వివరించారు. ఇ– క్రాపింగ్‌లో జియో ఫెన్సింగ్‌ ఫీచర్‌ కూడా కొత్తగా ప్రవేశపెట్టామని అధికారులు అన్నారు. ఖరీఫ్‌ పంటల ఇ– క్రాపింగ్‌ మొదలైందని, ఈసారి ముందస్తుగానే మొదలుపెట్టామని అధికారులు తెలిపారు. ఎప్పటికప్పుడు డేటాను అధికారులు అప్‌లోడ్‌ చేస్తున్నామన్నారు.

ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ రంగంలో డ్రోన్లను విస్తృతంగా వినియోగించాలని డ్రోన్‌ టెక్నాలజీ ద్వారా వ్యవసాయ రంగంలో బహుళ ప్రయోజనాలు పొందాలని అన్నారు. ఇప్పటికే పురుగుమందుల వినియోగం లాంటి కార్యక్రమాలు డ్రోన్ల ద్వారా చేస్తున్నాం అని చెప్పారు. ఇదే కాకుండా డ్రోన్ల ద్వారా భూసార పరీక్షలు చేయించే పరిస్థితిని తీసుకురావాలని అన్నారు. తద్వారా ఆర్బీకే స్థాయిలో భూసార పరీక్షలు చేసే స్థాయికి ఎదగాలి అని చెప్పారు.

భూసార పరీక్షలను క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు డ్రోన్ల ద్వారా తెలుసుకునే పరిస్థితి వస్తే.. ప్లాంట్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను సమర్థవంతంగా అమలు చేసే అవకాశం ఉంటుందని అన్నారు. డేటా కూడా కచ్చితత్వంతో ఉండేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. దీంతోపాటు పంట దిగుబడులపై అంచనాలకు కూడా డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఇప్పటికే వరి దిగుబడులపై డ్రోన్ల ద్వారా అంచనాలు పొందేలా డ్రోన్‌ టెక్నాలజీని వాడుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నామన్నారు. మిగతా పంటల విషయంలో కూడా ఈ తరహా ప్రయోజనాలు డ్రోన్‌ టెక్నాలజీ ద్వారా వచ్చే పరిస్థితి ఉండాలని సీఎం అన్నారు.

CM YS Jagan Review On Agriculture And Horticulture Departments

CM YS Jagan Review On Agriculture And Horticulture Departments

బహుళ ప్రయోజనకారిగా డ్రోన్లను వినియోగించుకోవడంవల్ల వ్యవసాయ రంగానికి, రైతులకు మరింత మేలు జరుగుతుందని.. ప్రభుత్వం వచ్చాక ఏర్పాటు చేసిన అగ్రిల్యాబుల ద్వారా 2.2లక్షల శాంపిళ్లను సేకరించి రైతులకు ఫలితాలు అందిస్తున్నామని అధికారులు తెలిపారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు ఇవ్వడంపై ప్రత్యేక దృష్టిపెట్టాం అని అన్నారు.
వీరికి రైతు భరోసా అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు.

వైయస్సార్‌ ఉచిత పంటలబీమా దేశానికి ఆదర్శంగా నిలిచిందని..ఈ ప్రభుత్వం వచ్చినతర్వాత ఇప్పటివరకూ రూ. 7802.5 కోట్లు ను 54.48 లక్షల మందికి పరిహారంగా అందించామని అధికారులు తెలిపారు. రబీ సీజన్‌కు సంబంధించి పంట బీమా పరిహారాన్ని అక్టోబరులో ఇచ్చేందుకు అన్ని రకాలుగా సిద్ధం అవుతున్నామని అధికారులు అన్నారు.

10వేల ఆర్బీకేల్లో 10వేల డ్రోన్లు తీసుకు వచ్చి వాటితో వ్యవసాయరంగంలో మార్పులు తీసుకురావాలని సీఎం అన్నారు. ముందస్తుగా 2వేల డ్రోన్లు తీసుకు వస్తున్నామని డ్రోన్‌ టెక్నాలజీలో 222 రైతులకు శిక్షణ ఇచ్చి.. పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

డ్రోన్ల విషయలో భద్రత, సమర్థవంతమైన నిర్వహణ, సర్వీసు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నామని డ్రోన్‌ ఖరీదైనది కాబట్టి భద్రత, రక్షణ విషయంలో అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు తెలియపరిచారు. డీజీసీఏ సర్టిఫికేషన్‌ను పాటిస్తున్నామని .. అన్నిరకాల భధ్రతా ప్రమాణాలు పాటించేలా, ఎదురుగా వచ్చే వస్తువును ఢీకొట్టకుండా నిలువరించే వ్యవస్థ ఉండేలా, నిర్దేశించిన మార్గంలోనే ఎగరవేసేలా, ఒకవేళ ఇంధన సమస్య వస్తే వెంటనే ఆటో పద్ధతిలో ల్యాంచింగ్‌ ఫ్యాడ్‌కు చేరుకునేలా ఈ డ్రోన్లు ఉంటాయని అధికారులు అన్నారు.

సాగులో శిక్షణ కార్యక్రమాలపై మరిన్ని వీడియోలు రూపొందించి ఆర్బీకే ఛానెల్‌ ద్వారా మరింతగా రైతులకు చేరువ చేయాలని సీఎం జగన్ అన్నారు. రైతుల పంటలకు ఎంఎస్‌పీ ధీమా కలిపించాలని, సీఎం ఆదేశాల మేరకు చట్టాలకు రూపకల్పన చేశారు. ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు, కంపెనీలు రైతుల దగ్గరనుంచి కొనుగోలు చేసేటప్పుడు కచ్చితంగా ఎంఎస్‌పీ ధరలు ఇవ్వాల్సిందే అని అన్నారు. సీఎం ఆదేశాలమేరకు దీనికి సంబంధించి ఏపీ ఎంఎస్‌పీ యాక్ట్‌– 2023ని ప్రభుత్వం తీసుకురానున్నది. ఆక్వా రైతులకు, డెయిరీ రైతులకు ఈ చట్టం ద్వారా వారి ఉత్పత్తులకు రక్షణ కల్పించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి చట్ట రూపకల్పన జరుగుతోందని అధికారులు తెలిపారు.

CM YS Jagan Review On Agriculture And Horticulture Departments

CM YS Jagan Review On Agriculture And Horticulture Departments in CM Camp Office

గడచిన నాలుగేళ్లలో వ్యవసాయ పంటల నుంచి 4.34 లక్షల ఎకరాల్లో ఉద్యానవన పంటలవైపు మళ్లింపు చేయడం జరుగుతుందని రెగ్యులర్‌ మార్కెట్‌కే కాకుండా పుడ్‌ ప్రాసెసింగ్‌కు అనుకూలమైన వంగడాలను ఉద్యానవన పంటల్లో ప్రోత్సహించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

గోడౌన్లు, కలెక్షన్‌ సెంటర్లు, కోల్డ్‌ రూమ్స్‌ నిర్మాణాన్ని పూర్తి చేయడం పై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం ఆదేశించారు. దీనివల్ల పంట ఉత్పత్తుల జీవితకాలం పెరుగుతుందని, రైతులకు మంచి ధరలు వస్తాయని, ముఖ్యంగా ఉద్యానవన పంటలకు ఈ మౌలిక సదుపాయాలు చాలా అవసరమని అధికారులు తెలిపారు.

పుడ్‌ ప్రాసెసింగ్‌ విషయంలో మరింత ముందుకు వెళ్లాలని, వివిధ జిల్లాల్లో పండుతున్న పంటల ఆధారంగా ఇప్పటికే పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు మొదలుపెట్టాలని, త్వరలో కొన్ని యూనిట్లు అందుబాటులోకి రానున్నాయని.. నియోజకవర్గాల వారీగా మ్యాపింగ్‌ చేయాలని అధికారులు తెలిపారు. ధరల్లో తీవ్ర హెచ్చు తగ్గులకు గురయ్యే టమోటా, ఉల్లిలాంటి పంటల ప్రాసెసింగ్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాలని.. ఈ పంటల సాగు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రాసెసింగ్‌ యూనిట్లు పెట్టాలని అధికారులకు ఆదేశాలను మంత్రి జారీ చేశారు.

అంతేకాకుండా మహిళలతో నడిచే సెకండరీ ప్రాసెసింగ్‌ యూనిట్లను తీసుకొచ్చే ప్రయత్నంచేయాలని.. మహిళల్లో స్వయం ఉపాధికి ఇది ఉపయోగపడుతుందని అన్నారు. ఆరువేల మైక్రో యూనిట్లు పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. చేయూత లాంటి పథకాన్ని వినియోగించుకుని.. ఈ యూనిట్ల ద్వారా మహిళలు స్వయం ఉపాధికి ఊతమివ్వాలని అధికారులకు సీఎం ఆదేశించారు.

పంటల సాగులో, బీమా కల్పనలో, ధాన్యం కొనుగోలులో రైతుభరోసా కేంద్రాలు ఇప్పటికే రైతులను చేయిపట్టుకుని నడిపిస్తున్నాయని సీఎం అన్నారు. ధాన్యం సేకరణలో ఆర్బీకేల ద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చేశామని కనీస గిట్టుబాటు ధరలు రాని ఏ పంట కొనుగోళ్లులో అయినా ఆర్బీకే జోక్యం చేసుకుంటుందని, మిగిలిన పంటల కొనుగోలు కూడా ఆర్బీకే కేంద్రంగా జరిగేలా చూడాలని ఏ రకమైన కొనుగోళ్లుకు అయినా ఆర్బీకే కేంద్రం కావాలని ముఖ్యమంత్రి అన్నారు.

విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వేటిలోనూ నకిలీలు, కల్తీ లేకుండా నివారించడంలో ఆర్బీకేలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పుడు మార్కెటింగ్‌లో కూడా ఆర్బీకేలు ప్రమేయం ఉండాలి. ప్రభుత్వం వ్యవసాయ ఉపకరణాలు, డ్రయ్యింగ్‌ ప్లాట్‌ఫాంలతో పాటు ప్రైమరీ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తుంది. ఇతర పంటలకు కూడా మార్కెట్‌తో సమన్వయం చేసి.. మధ్యవర్తుల ప్రమేయాన్ని నిరోధించాలి. ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

Also Read: Sea Food Festival: విజయవాడలో ఈ నెల 28 నుండి 30 వరకు సీ ఫుడ్ ఫెస్టివల్.!

Arka Savi Rose Cultivation: కొత్త రకం గులాబీలో అధిక లాభాలు పొందుతున్న రైతులు..

Leave Your Comments

Sea Food Festival: విజయవాడలో ఈ నెల 28 నుండి 30 వరకు సీ ఫుడ్ ఫెస్టివల్.!

Previous article

Turmeric Price: పసుపు పండించిన రైతులకి శుభవార్త… రికార్డు స్థాయిలో పెరిగిన పసుపు ధర…

Next article

You may also like