Chief Minister YS Jagan Mohan Reddy: రైతు పండించిన పంటలకు మెరుగైన ధర కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఈసందర్బంగా రూ.1,719 కోట్లతో తలపెట్టిన 11 ఆహారశుద్ధి ప్రాజెక్టులకు వర్చువల్ విధానంలో సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఆరు యూనిట్లకు ప్రారంభోత్సవం చేయగా మంగళవారం ఐదు యూనిట్లకు శంకుస్థాపన చేశారు. రైతులు పండించిన పంట ఉత్పత్తులకు అదనపు విలువ చేకూర్చడం ద్వారా వాటికి గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రోత్సహిస్తోందన్నారు.\

YS Jagan virtually starts 11 Food Processing Units
ఏటా 3.14 లక్షల టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్ల ద్వారా 925 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలుగుతుండగా.. 40,307 మంది రైతులకు మేలు జరగనుందన్నారు. వీటితోపాటు ఆర్బీకేలకు అనుబంధంగా నిర్మించిన 421 కలెక్షన్ సెంటర్లు, 43 కోల్డ్ రూమ్స్‌ను ముఖ్యమంత్రి రైతులకు అంకితం చేశారు. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కోసం అవసరమైన ముడిసరుకును రైతుల నుంచి సేకరించే సందర్భంగా వారికి ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధరకు మించి కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది.
రైతులకు అండగా ఆర్బీకేలు..
మార్కెట్లో రైతులకు ధరలు తగ్గినప్పుడు ఆర్బీకేలు జ్యోకం చేసుకుని.. రైతులకు తోడుగా ఉండే కార్యక్రమం చేస్తున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. రూ.8 వేల కోట్లు ఇప్పటి వరకు ఖర్చు చేశామని, చిత్తూరులో మూడు, అన్నమయ్యలో ఒకటి..చొప్పున ఆహారశుద్ది కేంద్రాలు ప్రారంభించామన్నారు. దాదాపు 14,400 మెట్రిక్ టన్నులకు సంబంధించి పండ్లు, టమాటాలు, ఇతర కూరగాయలు కొనుగోళ్లకు, ఆయా రైతులకు మద్దతు ధర కల్పించడమే ప్రధాన ఉద్దేశంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. 13 సెకండ్రీ ప్రాసెసింగ్ యూనిట్లు ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉన్నాయని సీఎం జగన్ తెలిపారు. మిల్లెట్స్‌కు పీడీఎస్‌లో అనుసంధానం చేసింది కూడా మన రాష్ట్రం ఒక్కటేనని, ఎంఎస్పీ ఫర్ మిల్లెట్స్ అనే కార్యక్రమం కూడా దేశంలో ఎక్కడా జరగని విధంగా ఆర్బీకేల ద్వారా మంచి ధరను ప్రకటించింది మన రాష్ట్రమే అని ఆయన తెలిపారు.

AP CM YS Jagan virtually starts 11 Food Processing Units
ప్రతి జిల్లాకు ఒక సెకండ్రీ ప్రాసెసింగ్ సెంటర్..
రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక సెకండ్రీ ప్రాసెసింగ్ సెంటర్‌ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఈ సెకండ్రీ ప్రాసెసింగ్ యానిట్స్ కూడా 7,200 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో తీసుకురావడంతో రైతులకు మేలు జరుగుతుందన్నారు. మార్కెట్లో రైతులకు ఇంకా మంచి ధరలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఆర్బీకే పరిధిలో కోల్డ్ రూమ్స్, ఉత్పత్తుల సేకరణ కేంద్రాలను మ్యాపింగ్ చేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఇలా చేయడం వల్ల ప్రైమరీ ప్రాసెసింగ్ అంటే.. గ్రేడింగ్ ఇతర పనులను క్షేత్రస్థాయిలో జరిగే అవకాశం ఉంటుందన్నారు. కేంద్రం మద్దతు ధర ఇవ్వని పంటలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా మద్దతు ధర కల్పిస్తోందన్నారు.
Read: Finger Millets Cultivation: రాగి పంట సాగు విధానం..
సీఎం ప్రారంభించిన యూనిట్లు ఇలా
సీఎం జగన్ ప్రారంభించిన ఆరు ప్రాజెక్టుల్లో నాలుగు టమాటా విలువ ఆధారిత యూనిట్లు, ఒక మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్, ఉల్లి విలువ ఆధారిత ఉత్పత్తుల పరిశ్రమలు ఉన్నాయి. ఈనాలుగు యూనిట్ల ద్వారా 60 మందికిఉపాధి, 2,414 మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. విజయనగరంలో రూ.4 కోట్లతో నిర్మించిన ఆరోగ్య మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్‌ను సీఎం ప్రారంభించారు. ఏటా 7,600 టన్నుల ప్రాసెసింగ్ సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈయూనిట్ ద్వారా రాగిపిండి, మిల్లెట్ చిక్కీలు, బిస్కెట్లు, సేమ్యాను తయారు చేస్తారు. కర్నూలు జిల్లాలో ఉల్లి విలువ ఆధారిత ఉత్పత్తుల కోసం ఒక్కో యూనిట్ రూ.లక్ష చొప్పున రూ.కోటితో 100 సోలార్ డీహైడ్రేషన్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు.

Chief Minister YS Jagan Mohan Reddy
మరోవైపు రూ.1,692 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఐదు ఆహారశుద్ధి పరిశ్రమలకు సీఎం వైఎస్ జగన్ భూమిపూజ చేశారు. సత్యసాయి జిల్లాలో 11 ఎకరాల్లో రూ.75 కోట్లతో వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ వేరుశనగ నూనె, పీనట్ బటర్, చిక్కీ, రోస్టర్డ్ సాల్టెడ్ పీనట్స్ తయారు చేస్తారు. ఏటా 55,620 టన్నుల వేరుశనగను ప్రాసెస్ చేసే సామర్థ్యంతో ఏర్పాటవుతోంది. ఆపరేషన్ గ్రీన్స్ స్కీమ్‌లో భాగంగా ఒక్కొక్కటి రూ.5.5 కోట్ల అంచనాతో అనంతపురం జిల్లాలో కల్యాణదుర్గం, కుందుర్పి, సత్యసాయి జిల్లాలో చెన్నేకొత్తపల్లిల్లో టమాటా ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క యూనిట్ సామర్థ్యం ఏటా 3600 టన్నులు.
ఉద్యాన రైతుల కోసం..
ఉద్యానపంట ఉత్పత్తుల నిల్వ, గ్రేడింగ్ కోసం గ్రామస్థాయిలో రూ.63.15 కోట్లతో నిర్మించిన 421 కలెక్షన్ సెంటర్లు, రూ.5.37 కోట్లతో నిర్మించిన 43 కోల్డ్ రూమ్స్ ను సీఎం వైఎస్ జగన్ రైతులకు అంకితం చేశారు. 1,912 ఆర్బీకేలకు అనుసంధానంగా ఏర్పాటు చేసిన ఈ కలెక్షన్ సెంటర్ల సామర్థ్యం ఒక్కొక్కటి వంద టన్నుల వంతున మొత్తం 42,100 టన్నులు. ఈ సెంటర్ల ద్వారా 1.80 లక్షలమంది రైతులకు మేలు జరగనుంది. అలాగే 194 ఆర్బీకేలకు అనుబంధంగా ఒక్కొక్కటి 10 టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన 43 కోల్డ్ రూమ్స్ ద్వారా 26,420 మంది రైతులు లబ్ధి పొందనున్నారు.
Also Read: Solar Powered Fan to Grill Corn: 75 సంవత్సరాల మహిళ అద్భుతమైన ఆలోచన..