CM Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రైతులు పెట్టుకునే వ్యవసాయ కనెక్షన్ల అంశంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏ నెలలో అయితే వ్యవసాయ కనెక్షన్ల కు దరఖాస్తు చేసుకుంటే అదే నెలలో కచ్చితంగా మంజూరు చేయాలని ఇంధన శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇంధన శాఖపై సమీక్షించిన సీఎం.. దీనిలో ఎలాంటి జాప్యం జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అటు ఇప్పటివరకు 1.06 లక్షల కనెక్షన్లు మంజూరు చేశామని.. మార్చి నాటికి మరో 20వేలకు పైగా కనెక్షన్లు మంజూరు చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు.
Also Read: Farmer Success Story: B-TECH చదివినా.. పాడి పరిశ్రమ చేస్తున్నాడు..!

CM Jagan Mohan Reddy
విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ (CM Jagan Mohan Reddy) .. వేసవి కాలంలో విద్యుత్ కొరత, కోతల సమస్య ఉండకూడదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా సంసిద్ధం కావాలని స్పష్టం చేశారు.
Also Read: Fall Armyworm – Paddy Blast: మొక్కజొన్నలో కత్తెర పురుగు – వరిలో అగ్గి తెగులు గుర్తు పట్టండిలా.!
అదేవిధంగా బొగ్గు నిల్వల విషయంలో అధికారులు తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలని ఇంధన శాఖ అధికారులకు సూచించారు. థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా ఉండాలని.. దానికోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని ఇంధన శాఖ అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు.
Also Read: Giriraja Poultry Farming: గిరిరాజ కోళ్లు పెంచుదాం..!