Agricultural Electricity Connections: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అన్నదాతలకు అండగా నిలుస్తోంది. రైతులకు ఆదాయ మార్గాలను పెంచడం కోసం ప్రభుత్వం అనేక పధకాలను రూపోందించింది. వీటి కోసం ప్రభుత్వాలు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేసింది. తద్వారా వ్యవసాయ దిగుబడులను పెంచేందుకు తోడ్పాటు అందిస్తోంది. వీటిని మంజూరు చేయడంలో మన ప్రభుత్వం ముందుజలో ఉంది. ఇప్పటివరకు ఏప్రభుత్వాలు ఇవ్వని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను మన ప్రభుత్వాలు మంజూరు చేశాయి. తాజాగా ప్రతి ఒక్కరికీ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయడం ద్వారా ప్రభుత్వం రికార్డు సృష్టించింది.
రైతులకు లక్షకు పైగా వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం విశేషం. రైతుల ప్రయోజనాలపై సర్కారు దృష్టి సారించింది. అన్నదాతకు పంటలు బాగా పండాలంటే నీరు ప్రదాన అవసరం. అందుకే ప్రభుత్వం వీటిపైన శ్రద్ధ పెట్టింది. దేశవ్యాప్తంగా 4,54,081 వ్యవసాయ పంపుసెట్లను విద్యుదీకరించాలని లక్ష్యం కాగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 7,35,338 కనెక్షన్లు జారీ చేశాయి. ఇందులో 1,24,311 కనెక్షన్లు ఆంధ్రప్రదేశ్‌లోనే మంజూరు కావడం గమనార్హం. రాజస్థాన్ రాష్ట్రం దేశంలో ద్వితీయ స్థానంలో నిలిచింది, మూడవ స్ధానంతో తెలంగాణా ఉంది. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీటి పైన ప్రత్యేక చొరవ తీసుకుని విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని మార్గదర్శకం చేశారు.
Also Read: Canopy Cultivation: పందిరి సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు
2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని ఏ రాష్ట్రంలో ఇవ్వనన్ని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను మన ప్రభుత్వం మంజూరుచేసింది. 20 సూత్రాల అమలు కార్యక్రమం 2022- 23 ఆర్థిక సంవత్సరం ఫలితాల నివేదికను కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికీ పెండింగులో లేకుండా అందరికి విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయడం ద్వారా ప్రభుత్వం రికార్డు సృష్టించింది.
2022- 23 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల జారీ వివరాలు ఇలా ఉన్నాయి. మొదటిస్ధానంలో ఆంధ్రప్రదేశ్ 24852- 1,24,311 ఉండగా, రెండవస్ధానంలో రాజస్థాన్ 44770- 99,137 మూడవస్ధానంలో తెలంగాణ 25148- 89183, కర్ణాటక 38602- 75117, ఉత్తరప్రదేశ్ 22058- 69201, బీహార్ 2764- 64768,ఛత్తీస్‌ఘడ్ 21000- 23188,గోవా 200- 222, గుజరాత్ 44500- 65792,హర్యానా 8800- 20056, హిమాచల్‌ప్రదేశ్ 1458- 4590, కేరళ 12000- 16713, మధ్యప్రదేశ్ 17237- 10077, ఒడిశా 1190- 18882
పాండిచ్చేరి 35- 45, పంజాబ్ 150000- 524, తమిళనాడు 15000- 50772, ఉత్తరాఖండ్ 1000- 2606, ఉత్తరప్రదేశ్ 22058- 69201 2022- 23 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల జారీ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Curry Leaves: కిలో రెండు రూపాయలు పలుకుతున్న కరివేపాకు.!