AP SC Women Farmers: సేంద్రియ వ్యవసాయం విషయంలో సన్నకారు రైతుల్ని ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 70,000 మందికి పైగా షెడ్యూల్డ్ కులాల (SC) మహిళలకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర సర్కారు సహజ వ్యవసాయం రసాయనాల వినియోగాన్ని మినహాయించి సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తుంది.
30 జిల్లాల్లో కౌలు రైతులతో సహా గుర్తించిన 71,560 మంది ఎస్సీ రైతులకు ఒక్కొక్కరికి రూ.10,000 వన్‌టైమ్ సబ్సిడీ మరియు వడ్డీ లేని రుణం ఇవ్వబడుతుంది. సంప్రదాయ వ్యవసాయం నుండి సహజ వ్యవసాయానికి మారడానికి మరియు వారి పెట్టుబడి ఖర్చులను తగ్గించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది.
Also Read: పంట మార్పిడి తో రైతులకు అధిక దిగుబడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ కుటుంబాలలో 12 శాతం ఎస్సీ వ్యవసాయ కుటుంబాలు ఉన్నాయి. వీరిలో అధిక శాతం కౌలు రైతులే. షెడ్యూల్డ్ కులాల జనాభా సంక్షేమానికి కృషి చేస్తున్న రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ హర్షవర్దన్ మాట్లాడుతూ… మేము మొదట మహిళా రైతులతో ప్రారంభిస్తున్నాము. సహజ సేద్యం వైపు మళ్లాలనే వారి అభిరుచుల ఆధారంగా రైతులను గుర్తించాం. గుర్తించబడిన రైతులందరూ చిన్న, సన్నకారు లేదా భూమి లేనివారు మరియు ఒక ఎకరం లేదా అంతకంటే తక్కువ భూమిని కలిగి ఉన్నారు. లబ్ధిదారులు సబ్సిడీని విత్తనాల కొనుగోలు, మల్చింగ్, బయో స్టిమ్యులెంట్స్ వంటి కార్యకలాపాలకు ఉపయోగించుకోవచ్చని ఆయన తెలిపారు. మైక్రో-క్రెడిట్ ఆధారంగా వారికి వడ్డీ లేని రుణం మంజూరు చేయబడుతుంది. రుణం మొత్తంపై ఎటువంటి పరిమితి లేదు. కానీ అంచనా ప్రకారం సగటు మొత్తం సుమారు రూ. 40,000 నుండి 50,000 ఉంటుందని వర్దన్ చెప్పారు.
2030 నాటికి మొత్తం రాష్ట్రాన్ని సహజ వ్యవసాయంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాజెక్ట్ కింద రైతులకు నోడల్ ఏజెన్సీ రైతు సాధికార సంస్థ ద్వారా సహజ వ్యవసాయంపై శిక్షణ ఇవ్వబడుతుంది.
ఏపీలో 41 శాతానికి పైగా కౌలు రైతులు ఉన్నారని, వారిలో ఎక్కువ మంది ఎస్సీ కుటుంబాలకు చెందిన వారేనని సుస్థిర వ్యవసాయ కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.వి.రామాంజనేయులు తెలిపారు. భూమి వారి పేరు మీద లేనందున వారు ఏ పథకాన్ని పొందలేరు. కాబట్టి వారు సాధారణ వ్యవసాయ రుణాన్ని కూడా పొందలేరు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ సవాలును అధిగమించడంలో వారికి సహాయపడుతుందని ఆయన అన్నారు.
Also Read: పప్పుధాన్యాల సాగు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు