ANGRAU: వ్యవసాయానికి సంబంధించిన అన్ని వనరులలోకి విత్తనం అనేది కీలకమైన మరియు క్లిష్టమైన వనరుగా పరిగణించవచ్చు. ఎందుకంటే పంట ఉత్పత్తి ఉత్పాదకతలు నాణ్యమైన విత్తనం పై ఆధారపడి ఉంటుంది. అధిక ఉత్పత్తిని రైతాంగం సాధించాలంటే నాణ్యమైన మంచి విత్తనాన్ని సకాలంలో రైతులకు అందించగలిగినట్లైతే మన రాష్ట్రం వ్యవసాయ రంగంలో ముందడుగులో ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు.

Seeds
సకాలంలో సరియైన మంచి రకం విత్తనం రైతులకు అందుబాటులో ఉంచాలంటే చక్కని ప్రణాళిక అత్యవసరం. నాణ్యమైన విత్తనం కొరకు ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం”, లాం ఫారమ్ గుంటూరు వారు వ్యవసాయ విశ్వవిద్యాలయ “వ్యవస్థాపక దినోత్సవం” (12.06.2023) సందర్భంగా విత్తన మహోత్సవం” కార్యక్రమమునకు శ్రీకారం చుట్టారు.
Also Read: Miyazaki Mango: ఒక కిలో మామిడి పండ్లలు 2. 70 లక్షలు… ఎలా సాగు చేయాలో తెలుసుకోండి.!

ANGRAU
ఇందులో భాగంగా వరి, కంది, మినుము, పెసర, శనగ, వేరుశనగ, నువ్వులు, రాగి, కొర్ర మరియు జొన్న పంటలలోని వివిధ రకముల వెరైటీలను 12.06.2023 వ తేదీన * ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం”, లాం ఫారమ్ గుంటూరు నందు విక్రయిస్తారు. కావున రైతు సోదరులు అందరు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా కృషి విజ్ఞాన కేంద్రం, నెల్లూరు వారు మనవి చేసుకుంటున్నారు. పంటల వివరములు క్రింది పట్టికలో పొందుపరచడం జరిగింది.
Also Read: Vanilla Crop: ఒక పంటతో రైతులు కోటీశ్వరులు అవుతారు.!