Tomato Farmer: రైతులు ఎంతో కష్టపడి పంటలు పండించిన కొన్ని సార్లు పంట ధరలు సరిగా లేకపోవడం వల్ల పండించిన పంటని తక్కువ ధరకి అమ్ముకోవాల్సి వస్తుంది. కష్టంతో పాటు అదృష్టం కూడా కొన్ని సార్లు తోడు ఉండాలి. ఇప్పుడు టమాట సాగు చేసిన రైతులకి అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లాలో చెందిన రైతు మురళి ఈ సంవత్సరం టమాట సాగు చేసి 45 రోజులో నాలుగు కోట్లు సంపాదించాడు.
రైతు మురళి గారు గత 48 ఏళ్లుగా టమాట సాగు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడు చూడనంత ఆదాయం ఈ సంవత్సరం పొందారు. దానితో ఒకేసారి టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదికలో వచ్చారు. ఈ టమాట సాగుతో ప్రతి సంవత్సరం 50 వేల కంటే ఎక్కువ సంపాదించలేదు.
Also Read: Tomato on Paytm: Paytm, ONDCలో సగం ధరకే టమోటా!
గత సంవత్సరంలో టమాట ధరలు బాగా తాగడంతో మురళి కుటుంబం నష్టపోయారు. దాని వల్ల ఈ రైతు చాలా అప్పుల్లో కూరుకుపోయారు. ఈ సంవత్సరం మంచి విద్యుత్ సరఫరాతో, నాణ్యమైన పంటతో, అనుకూలమైన ధరతో రైతు మురళి జీవితం మలుపు తిరిగింది. మంచి ధర ఉండటం ద్వారా 45 రోజులో కోటీశ్వరుడు అయ్యారు.
గత సంవత్సరం నష్టాలు ఈ సంవత్సరం లాభాలతో తీర్చుకున్నారు. అప్పులు అని తీర్చుకున్నారు. ఇప్పుడు ఈ రైతు పొలం నుంచి 15-20 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మంచి ధర రావడం ద్వారా ఈ రైతు కష్టాలు అని తీరిపోయాయి అని చాలా ఆనందంగా ఉన్నారు.
Also Read: Tomato linked with Aadhar Card: ఏపీ లో ఇక నుంచి ఆధార్ కార్డు ఉంటేనే టమాటా.!