Ambedkar’s 66th birth Anniversary Celebrations: ఆచార్య యన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, లాం, గుంటూరు లోని పరిపాలనా కార్యాలయ ప్రాంగణంలో (6.12.2022) ప్రపంచ మేధావి, న్యాయకోవిధుడు, బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం, దళిత ఉద్యమ దార్శనికుడు, భారత రాజ్యాంగ రూపశిల్పి / నిర్మాత మరియు మన రాజ్యాంగ పితగా పేరుగడించిన భారత దేశం నుండి వెనుకబడిన మరియు నిమ్న వర్గాల నుండి మొట్టమొదటిసారిగా న్యాయవాద వృత్తిని చేపట్టి, వారి ఉపాధ్యాయులు పెట్టిన పేరు డా. బి. ఆర్. అంబేద్కర్ గా పేరు గడించిన భారత రత్న డా. భీమ్ రావు రాంజీ అంబేద్కర్ గారి 66వ వర్ధంతిని పురస్కరించుకొని విశ్వవిద్యాలయ గౌరవ ఉపకులపతి డా. ఆదాల విష్ణువర్ధన రెడ్డి గారు చిత్రపటానికి పుష్ప నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా డా. ఆదాల విష్ణువర్ధన రెడ్డి గారు ప్రసంగిస్తూ, వీరు స్వతహాగా న్యాయకోవిదులైనందున, మన దేశ మొట్టమొదటి దివంగత ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రు వీరిని మన దేశ మొట్టమొదటి చట్ట మరియు న్యాయశాఖ మంత్రివర్యులుగా నియమించడమేకాక, వారిని రాజ్యాంగం ప్రతిని రూపొందించే సంఘానికి అధ్యక్షులుగా చేసినందున, వారు మన రాజ్యాంగనిర్మాతగా వ్యవహరించడమే కాకుండా, 1956 జనవరి 26 నుండి మన దేశాన్ని ఒక సర్వసత్తాక, సామ్యవాద, లౌకికవాద, గణతంత్ర రాజ్యం మరియు దేశంగా రూపొందించడంలో తనవంతు పాత్ర పోషించారని, సమానత్యం, స్వేచ్ఛా, సౌభ్రాతృత్వం, సమన్యాయం కల్పించడం ద్వారా ప్రపంచంలోని ఏ రాజ్యాంగానికి లేనంత హుందాతనం, విశిస్టతను, ప్రాముఖ్యాన్ని మన రాజ్యాంగానికి ఆయన కల్పించారని తెలిపారు.
రిజిస్ట్రార్ డా. జి. రామారావు గారు ప్రసంగిస్తూ, డా. భీమ్ రావు రామ్ జీ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14వ తారీఖున దళిత, నిమ్న, అంటరాని కులంగా నాడు భావించబడ్డ మరియు అణగారిన మహర్ కులానికి చెందిన మరాఠీ కుటుంబంలో బ్రిటిష్ ఇండియా లోని సెంట్రల్ ప్రావిన్స్ (ఇప్పటి మధ్యప్రదేశ్ లోని డా.॥ అంబేద్కర్ నగర్) కి చెందినా మొహోవ గ్రామంలో జన్మించారని,. ఒక దళితుడుగా పుట్టిన ఈయన, హిందూ సమాజం లోని అసమానతలను చూసి, తన అంతిమ కాలంలో చివరకి బౌద్ధ మతం స్వీకరించారన్నారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు: పరిశోధనా సంచాలకులు డా. ఎల్. ప్రశాంతి గారు గారు, విస్తరణ సంచాలకులు డా. పి. రాంబాబు గారు, వ్యవసాయ పీఠాధిపతి డా. ఏ. ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, వ్యవసాయ ఇంగినీరింగ్ మరియు సాంకేతికత పీఠాధిపతి డా. ఎ. మణి గారు, గృహ విజ్ఞాన పీఠాధిపతి డా. సిహెచ్. చిరంజీవి గారు, విద్యార్థి కార్యకలాపాల పీఠాధిపతి డా. పీ. సాంబశివరావు గారు, పరీక్షల నియంత్రణాధికారి డా. పి. సుధాకర్ గారు, బోధన, బోధనేతర మరియు ఒప్పంద సహాయక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Also Read: Agri-Tech 3rd Day 2022: మూడవరోజు అగ్రి టెక్ – 2022 వ్యవసాయ యాంత్రీకరణ లో విన్నూత సాంకేతికతలు.!