Acharya NG Ranga Birth Anniversary Celebrations: ప్రభాతవార్త రంగా కిసాన్ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ రైతాంగ ఉద్యమ నేత ఆచార్య ఎన్ రంగా 28వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత ఎఎంసి ఎదుట ఆచార్య రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అనంతరం సంతపేట రంగాభవన్లో జరిగిన సభలో పలువురు ప్రసంగించారు. సభకు అధ్యక్షత వహించిన సంస్థ అధ్యక్షులు ఆళ్ళ వెంకటేశ్వరరావు’ మాట్లాడుతూ లండన్లో ఉన్నత విద్య అభ్యసించిన ఆచార్య రంగా మద్రాసులోని పచయప్ప కళాశాలలో అధ్యాపకులుగా పని చేశారని, రైతాంగ దుస్థితి చూసి చలించిపోయి జమిందారి వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించారన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న ఆచార్య రంగా రైతు శ్రేయస్సు కోసం రైతుకూలి ప్రజారాజ్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించారన్నారు.
Also Read: Minister Niranjan Reddy: తెలంగాణలో సమృద్ధిగా చేపలు – మంత్రి నిరంజన్ రెడ్డి

Acharya NG Ranga Birth Anniversary Celebrations
సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్గా రైతుల సమస్యలపై గళమెత్తిన ఆచార్య రంగా పాలకులను ఒప్పించి రైతు అనుకూల నిర్ణయాలు వచ్చేలా చేశారన్నారు. రైతు సంక్షేమం, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ పటిష్టతకు ఆ మహనీయుడు అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించిందన్నారు. సభలో సంస్థ కార్యదర్శి చుంచు శేషయ్య, సభ్యులు డాక్టర్ ఎన్ చంద్రశేఖరరావు, గుండవరపు కోటేశ్వరరావు, ధూళిపాళ వీరనారాయణ, రైతు నాయకులు చుండూరి రంగారావు, వి హనుమారెడ్డి, కామేపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Inter Cropping: చెరకుతో పాటు ఈ రెండు పంటలను సాగు చేస్తే రెట్టింపు ఆదాయం.!