ఆంధ్రప్రదేశ్

YSR Rythu Bharosa Registration 2023: రైతు భరోసా పథకానికి కొత్త దరఖాస్తుల స్వీకరణ.!

2
YSR Rythu Bharosa Registration 2023
YSR Rythu Bharosa

YSR Rythu Bharosa Registration 2023: వైఎస్సార్ రైతు భరోసా ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద రైతులకు సంవత్సరానికి రూ.13,500 ఆర్థిక సహాయం అందుతుంది. ఈమొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500, భారత ప్రభుత్వం రూ.6,000 భరిస్తుంది. కౌలు రైతులు కూడా ఈ పథకానికి అర్హులుగా పరిగణించబడతారు. ఆంధ్రప్రదేశ్ లోని 38 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చడానికి రూ.3785 కోట్లను విడుదల చేస్తూ 2019 అక్టోబర్ 15న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ రైతు భరోసాను ప్రారంభించారు. ఈ నాలుగు సంవత్సరాలలో ఎంతో మంది రైతులు లబ్ధి పొందారు. పొందుతున్నారు. అయితే కొత్తగా ఈ పథకానికి అర్హులు అయినటువంటి అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం ఈఆవకాశాన్ని కల్పిస్తోంది.

ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. వైఎస్సార్ రైతు భరోసా పథకానికి అర్హులైన రైతుల నుంచి ప్రభుత్వం కొత్త దరఖాస్తులను స్వీకరిస్తుంది. అర్హత ఉన్న వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలు లేదా గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇప్పటివరకు ఈపథకం ద్వారా లబ్ధిపొందుతున్న రైతులు మాత్రం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.

Also Read: Zero-Budget Natural Farming: రైతులకు ప్రతినిత్యం ఆదాయాన్నిచ్చే పంటలు తప్పనిసరి.!

Rythu Bharosa

YSR Rythu Bharosa Registration 2023

అర్హత ఉండి కూడా మీకు డబ్బులు అందనట్లైతే దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. అయితే వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా ప్రభుత్వం ప్రతీ ఏడాది రైతులకు విడతల వారీగా రూ.13,500 అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద రూ.6 వేలు ఇస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500 అందిస్తోంది. ప్రతీ ఏడాది మూడు విడతలుగా వీటిని రైతుల అకౌంట్లలో జమ చేస్తోంది. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పట్టాదారు పాసు పుస్తకం రైతు భరోసా కేంద్రానికి తీసుకెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత అధికారులు పరిశీలించి లబ్ధిదారుల జాబితాలో పేరు చేరుస్తారు. అప్పటి నుంచి మీరు కూడా దీనికి అర్హత సాధిస్తారు. ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు మీకు వర్తిస్తాయి.

అన్నదాతలు రైతు భరోసా కేంద్రానికి వెళ్లి సంప్రదిస్తే వైఎస్సార్ రైతు భరోసా పథకంలోకి చేర్చుకుంటారు. రైతులు పొలం పట్టా, ఆధార్ కార్డు, రేషన్ కార్డు లాంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. పాసు పుస్తకం ఎవరి పేరు మీద ఉంటే వారి ఆకౌంట్ కు మణి జమ చేస్తారు. అర్హులకు వైఎస్సార్ రైతు భరోసా స్కీమ్ కింద ఏపీ ప్రభుత్వం ప్రతి ఏటా 13,500 రూపాయలను మూడు విడతలుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తుంది.

Also Read: Hike in Onion Prices: కోయకుండానే కన్నీళ్లు.. షాకివ్వనున్న ఉల్లి రేటు..

Leave Your Comments

Zero-Budget Natural Farming: రైతులకు ప్రతినిత్యం ఆదాయాన్నిచ్చే పంటలు తప్పనిసరి.!

Previous article

Watermelon Cultivation: రైతులకు తీపి గా మారిన పుచ్చకాయ సాగు.!

Next article

You may also like