ఆంధ్రప్రదేశ్

ANGRAU Republic Day 2023: ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగిన 74వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు.!

0
ANGRAU Republic Day 2023
ANGRAU Republic Day 2023

ANGRAU Republic Day 2023: ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ANGRAU), లాం, గుంటూరు పరిపాలనా భవనములో జనవరి 26 2023 న రిపబ్లిక్ దినోత్సవం సందర్బంగా గౌరవ ఉప కులపతి శ్రీ డా. వి. విష్ణువర్ధన్ రెడ్డిగారు జాతీయపతాకాన్ని ఎగరవేసారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ప్రతి ఒక్క ఉద్యోగి తన బాధ్యతలకు పునరంకింతంకావాలని, తద్వారా విశ్వవిద్యాలయం అభివృద్ధికి, రాష్ట్ర మరియు జాతీయ అభివృద్ధికి దోహదపడాలని తెలియచేశారు.

74th Indian Republic Day celebrations were held at Acharya N.G. Ranga Agricultural University

74th Indian Republic Day celebrations were held at Acharya N.G. Ranga Agricultural University

ఈ సందర్భంగా పలువురు వక్తలు రిపబ్లిక్ దినోత్సవం ఆవశ్యకతను వ్యక్తుల హక్కులతో పాటు బాధ్యతలు నిర్వహించడముతో ముందు ఉండాలని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ జి. రామారావు గారు, డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డా.ఎ. ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. పరిశోధనా సంచాలకులు డా. L ప్రశాంతి గారు, విస్తరణ సంచాలకులు డా. పి. రాంబాబు గారు, వ్యవసాయ ఇంజినీరింగ్ డీన్ డా. మణి గారు, విద్యార్థి కార్యకలాపాల పీఠాధిపతి శ్రీ. డా. పి. సాంబశివరావు గారు, బోధన మరియు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave Your Comments

Republic Day 2023: PJTSAU లో ఘనంగా జరిగిన 74వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు.!

Previous article

Solar Dryers: సౌరశక్తితో పనిచేసే పరికరాలు.!

Next article

You may also like