వార్తలు

విద్యార్థినుల మదిలో మొలకెత్తిన ఆలోచన..

0

విద్యార్థినుల మదిలో మొలకెత్తిన ఆలోచన అంకురించింది. పోస్టు గ్రాడ్యుయేషన్ అభ్యసిస్తూనే తమ చదువుతో సంబంధం ఉన్న రంగాన్ని ఎంచుకుని సాగుతున్నారు. ఆహార అలవాట్లలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుని విద్యార్థి దశలోనే ఉపాధి బాటలు పరుచుకున్నారు. ఖమ్మంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కాళాశాలలో ఎంఎస్సీ (వృక్షశాస్త్రం) చదువుతున్న ఎన్. శృతి, ఎస్. తేజస్విని, శిరీషలతో పాటు ఎంఎస్సీ రసాయనశాస్త్రం, ఫార్మా- డి చదువుతున్న నిఖిల్, సౌమ్యలు డిగ్రీ నుంచి మంచి మిత్రులు. చదివేది వృక్షశాస్త్రం. ఉపాధి దానికి అనుబంధ రంగమైతే బాగుంటుందని ఆలోచించారు. ప్రస్తుత సమాజంలో ఎదురవుతున్న పోషకాహార సమస్యల పరిష్కానికి అవసరమైన ప్రాజెక్ట్ కు రూపకల్పన చేశారు. ప్రపంచంలోని పలు దేశాల్లో ప్రాచుర్యంలో ఉన్న మైక్రోగ్రీన్స్ పెంపకంపై దృష్టి పెట్టారు. ఉత్తర భారతదేశంలో మొగ్గతొడిగిన మైక్రోగ్రీన్స్ ప్రస్తుతం హైదరాబాద్ లోనూ విస్తరిస్తోంది.
విత్తనం మొలకెత్తే విధానంపై అధ్యయనం చేశారు. వృక్షశాస్త్ర అధ్యాపకురాలు. తుమ్మా వంశీప్రియ సలహాలు, సూచనలు తీసుకున్నారు. కళాశాలలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తమ ప్రాజెక్ట్ ఉద్దేశాలను వివరించి ఆకట్టుకున్నారు. కార్యరూపం ఇస్తూ ఖమ్మం నగరంలోని బుర్హాన్ పురంలో మైక్రోగ్రీన్స్ పెంపకాన్ని ప్రారంభించారు. విద్యార్థినులు లాక్ డౌన్ సమయంలో మైక్రోగ్రీన్స్ ను మొదట తమ ఇళ్లలో పెంచటం ప్రారంభించారు. వాటిని మంచి ఆహారమని గుర్తించారు. ఇంకోపక్క చాలామంది కోవిడ్ కాలంలో పోషక విలువలున్న ఆహారానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. డిమాండ్ కు అనుగుణంగా ఆర్డర్ పై కావాల్సిన వారి ఇళ్ల వద్దకే మైక్రోగ్రీన్స్ ను సరఫరా చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా “యాంపిల్ గ్రీన్” అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. 50 గ్రాములకు రూ. 450 చొప్పున తీసుకుంటున్నారు. వారం నుంచి రెండు వారాల లోపు ప్రాయం వుండే వాటినే చిగురాకులు అంటారు. తెల్ల ముల్లంగి, పింక్ ముల్లంగి, వంకాయ రంగు ముల్లంగి, బీట్రూట్, నువ్వులు, పొద్దుతిరుగుడు, మెంతికూర, తోటకూర, పాలకూర, పెసరాకు, ఆవాలు, బఠాణి, గోధుమ గడ్డిని పెంచుతున్నారు. చిగురాకులు పచ్చిగానూ లేదా ఉడికించిన వంటల్లోనూ వాడొచ్చు. ప్రస్తుతం గోధుమ గడ్డికి ఎక్కువ మంది ఆర్డర్లు ఇస్తున్నారు. ఎలాంటి రసాయనాలు, పురుగు మందులు వాడకుండా పెంచుతున్నారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ఖమ్మంలోని వీటి వినియోగం గురించి ఎక్కువగా ప్రచారం చేసి విక్రయిస్తున్నారు.

Leave Your Comments

గుడ్లు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Previous article

బ్లూ బెర్రీస్ ఆరోగ్య ప్రయోజనాలు..

Next article

You may also like