Insects: పర్యావరణ వ్యవస్థలో కీటకాలు కీలక పాత్ర పోషిస్తాయి. అవి పండ్లు, పువ్వులు మరియు కూరగాయలను కాపాడటంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. అవి ప్రపంచ పంట జాతులలో కనీసం 75 శాతం ఉత్పాదకతకు గణనీయంగా దోహదం చేస్తాయి. కీటకాలు తెగుళ్లను అదుపులో ఉంచుతాయి. లేడీబర్డ్ అఫిడ్స్ సమస్య నుండి పంటను కాపాడుతుంది. ఇక కప్పలు, బల్లులు, తొండలకు, పక్షులు మరియు క్షీరదాలకు కీటకాలు ఆహారంగా ఉపయోగపడతాయి.
భవిష్యత్తులో కీటకాలన్నింటినీ కోల్పోతే మనం ఇకపై కోకో బీన్స్, బ్రెజిల్ గింజలు మరియు పండ్లను ఉత్పత్తి చేయలేమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కాగా జీవవైవిధ్యం మరియు ఆహార ఉత్పత్తిపై వాయు కాలుష్యం చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుందని తాజా నివేదిక వెల్లడించింది.
Also Read: కీటకాల నిర్మూలనకు నూతన టెక్నాలజీ
జెయింట్ ఆసియా తేనెటీగలు భారతదేశంలో 80 శాతం కంటే ఎక్కువ తేనెను ఉత్పత్తి చేస్తాయి మరియు 687 కంటే ఎక్కువ మొక్కల జాతులను పరాగసంపర్కం చేస్తాయి. అయితే ప్రస్తుతం విపరీతమైన వాయు కాలుష్యంతో అనేక కీటకాలు కనుమరుగైపోయాయి. వాయు కాలుష్యం ప్రభావం కీటకాలపై పడుతుండటంపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాలుష్యం కీటకాలను ఎలా దెబ్బతీస్తుంది?
వాయు కాలుష్య కారకాలు కీటకాలపై తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నాయని నివేదిక చెప్తుంది. కాలుష్యం కారణంగా తేనెటీగల హృదయ స్పందన రేటు, ఒత్తిడి, రక్త కణాలు ప్రభావితమైనట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఇక వాయు కాలుష్యాల ప్రభావం కీటకాల వాసన సామర్థ్యాన్ని, పరాగసంపర్క శక్తిని తగ్గిస్తుంది. ఇక వాయు కాలుష్యం మనుషులపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. ఆస్తమా, ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులు, అల్జీమర్స్ ఊబకాయం, అకాల మరణం సంభవించడం లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి.
Also Read: కుసుమ పంటలో ఆశించు కీటకాలు మరియు వాటి యాజమాన్యం