అంతర్జాతీయంతెలంగాణవార్తలు

Bayer Cotton Seed Crop Gene Research Center: సాగునీటి సదుపాయం ఉంటే హెక్టారుకు లక్ష 10 వేల మొక్కలు.!

1
Bayer Cotton Seed Crop Gene Research Center
Bayer Cotton Seed Crop Gene Research Center

Bayer Cotton Seed Crop Gene Research Center: అమెరికాలో అధికసాంద్రత వలన పత్తి సాగు బాగుంది. వర్షాధారం ఉంటే హెక్టారుకు 60 నుండి 75 వేల మొక్కలు నాటొచ్చు. సాగునీటి సదుపాయం ఉంటే హెక్టారుకు లక్ష 10 వేల మొక్కలు నాటొచ్చు. భవిష్యత్ లో హెక్టారుకు లక్ష 40 వేల మొక్కలు నాటేందుకు ప్రయత్నిస్తున్నారు. పంటల వైవిధ్యీకరణలో భాగంగా ఇక్కడి రైతులు పత్తి పంట తర్వాత జొన్న సాగు చేస్తూ పత్తిలో అధిక దిగుబడులు సాధిస్తున్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణ, అధిక ఉత్పాదకతనిచ్చే వంగడాలు, పెద్ద కమతాలు అమెరికా రైతుల విజయ రహస్యం.

Also Read: High Density Planting in Cotton: అధిక సాంద్ర పద్దతిలో “తెల్ల బంగారం”సాగు

మన దేశంలో పాలకులకు ముందుచూపు లేకపోవడం మూలంగా అత్యధిక శాతం మందికి ఉపాధినిచ్చే వ్యవసాయరంగం ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వ్యవసాయరంగ స్వరూపం సంపూర్ణంగా మారుతున్నది. రైతుబంధు, రైతుభీమా, 24 గంటల ఉచిత కరంటు, సాగునీటి రాకతో తెలంగాణ రైతులలో ఆత్మవిశ్వాసం పెరిగింది.

పంటల వైవిధ్యీకరణ, వ్యవసాయ యాంత్రీకరణ, మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటల వైపు రైతులను ప్రోత్సహించి వ్యవసాయ రంగాన్ని లాభదాయకమైన వ్యాపారరంగంగా మార్చాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం. పత్తి సాగులో ఆధునిక పద్దతులు, అధిక సాంధ్రత పత్తి సాగుపై అధ్యయనంలో భాగంగా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో పత్తి పరిశోధనా కేంద్రాన్ని సందర్శించి, శాస్త్రవేత్తలతో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు రవీంద్ర నాయక్ గారు, డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, సీడ్స్ ఎండీ కేశవులు గారు సమావేశమయ్యారు.

Also Read: Cotton Crop: ప్రపంచ వస్త్ర పరిశ్రమకు మూలాధారమైన పంట.!

Leave Your Comments

Cotton Crop: ప్రపంచ వస్త్ర పరిశ్రమకు మూలాధారమైన పంట.!

Previous article

Seed Cleaning in Chili Crop: మిరపలో విత్తనశుద్ధి – నారుమడిలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు

Next article

You may also like