Agriculture Equipment: రైతులను అన్నివిధాలాలుగా ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొస్తున్నాయి. తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వం రైతుల (Farmers Income) ఆదాయాన్ని పెంచేందుకు సరికొత్త ప్రణాళికలతో ముందుకెళ్తుంది. ప్రాంతీయ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తమిళనాడు టూరిజం మంత్రి డాక్టర్ ఎం. మతివెంతన్ రూ. 1.98 కోట్ల విలువైన వ్యవసాయ పరికరాలను జిల్లాలోని రైతులకు అందజేశారు. రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ.. జిల్లాలోని చిన్న, మధ్యతరహా రైతులను గుర్తించిందని, ఆధునిక యంత్రాల వల్ల పంటల దిగుబడిని పెంచేందుకు లబ్ధి పొందుతారని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. దీని ద్వారా రైతులు ఉత్తమ ఫలితాలను పొందుతూనే డబ్బు ఆదా చేయడంలో సహాయపడుతుందని అన్నారు.
కాగా.. వ్యవసాయ రంగంలో అభివృద్ధిని తీసుకురావాలనే లక్ష్యంతో రైతు సంఘాలను స్థాపించినట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో 1,460 రైతు సంఘాలు ఉండగా, ఈ ఏడాది కొత్తగా 33 సంఘాలను ఏర్పాటు చేశారు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో ప్రతి సంఘానికి 5 లక్షలు అందుతాయి. అందులో భాగంగా రైతులు అత్యాధునికమైన యంత్రాలు మరియు పరికరాలను కొనుగోలు చేయగలరు.
Also Read: వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి ‘స్మార్ట్ ఫార్మింగ్ డేటా’
కొత్తగా ఏర్పాటైన 33 రైతు సంఘాలకు 285 రకాల యంత్రాలను, పరికరాలను జిల్లా కలెక్టర్ శ్రేయా పి సింగ్ సమక్షంలో మంత్రి అందజేశారు. అదేవిధంగా ఇటీవల కోవిడ్-19తో మరణించిన రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న మహబూబ్ బాషా కుటుంబానికి 25 లక్షల చెక్కును అందజేశారు. మరోవైపు పరాలి గ్రామంలో నీట మునిగి మృతి చెందిన మణికందన్ కుటుంబానికి లక్ష రూపాయల చెక్కును అందజేశారు.
Also Read: వ్యవసాయ యంత్రాల ద్వారా రైతులు తమ ఆదాయాన్ని పెంచుకోవచ్చు