జాతీయంవార్తలు

Agricultural yield loss: దేశంలో దిగుబడి ఎందుకు తగ్గుతోంది

0

Agricultural Field వ్యవసాయానికి భారత దేశం పెట్టింది పేరు. కానీ ఇది ఒక్కరితో సాధ్యం కాదు. ఇది ఒక సమూహంతో ముందుకు సాగుతుంది. 1950లో వరి గోధుమల ఉత్పత్తి 5 కోట్ల టన్నులుగా ఉండగా ప్రస్తుతం అది 50 కోట్ల టన్నులకు చేరుకుంది.

కానీ, ఇప్పటికీ దేశంలోని పంటల దిగుబడి రేటు మాత్రం తక్కువే. ప్రపంచ సరాసరి దిగుబడితో పోల్చుకుంటే లోపం స్పష్టంగా కనిపిస్తుంది. భారత్‌తో పోల్చితే చైనాలో సేద్యపు భూమి తక్కువగా ఉంటుంది. కానీ దిగుబడి మాత్రం చాలా ఎక్కవ..

Why is agricutural field declining in india?

ఇండియా తలుచుకుంటే వ్యవసాయ ఉత్పత్తిని సుమారు రెండింతలు చేయొచ్చు. కానీ దాని కోసం మరో రెండు తరాల టైం పడుతుంది. దేశంలోని వ్యవసాయ యోగ్యమైన నేలల్లో ఇప్పటికే సుమారు నలభై శాతం దెబ్బతిన్నది. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలే చెబుతుండటం గమనార్హం. అశాస్త్రీయ పద్దతుల్లో వ్యవసాయం, నేలను పదేపదే ఉపయోగించడం వల్ల, నీటిని వృథా చేయడం వల్ల, అడవుల నరికివేయడం వల్ల భూసారం తగ్గిందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

ఒక ప్రాంతంలో నేల 2.5 సెంటీమీటర్ల మందంలో సారవంతంగా మారేందుకు సుమారు 500 ఏళ్లు పడుతుందట. కానీ అది నాశనం కావడానికి కేవలం 10 సంవత్సరాలు సరిపోతుందని ఐక్య రాజ్య సమితి ఓ నివేదికలో వెల్లడించింది.

దేశంలో గత 60 ఏళ్లలో 2.2 కోట్ల బావులను తవ్వారని ఐక్యరాజ్యసమితి పరిశోధనలో వెల్లడైంది. రాను రానూ బావుల లోతు పెరుగుతున్నదని, నీళ్లు రావడం కష్టంగా మారిందని తెలుస్తోంది.

నీటి వనరులను సద్వినియోగం చేసుకునేందుకు శాస్త్రవేత్తలు అనేక విధానాలను రూపొందించారు. ఇలాంటి ప్రయోగాల్లో ఇజ్రాయెల్‌ వంటి దేశాలు ముందుంటున్నాయి. అక్కడ తక్కువ నీటితో ఎక్కువ దిగుబడిని సాధించడం సాధ్యమైంది. బిందు సేద్యం పద్దతి ద్వారా ఎన్నో లాభాలు చేకూరుతాయి. చెరుకుతో పాటు మరికొన్ని ఇతర పంటలకు వాడొచ్చు. కానీ వరికి ఇది ఉపయోగపడదు. మరి ఇలాంటి విషయాలపై మరిన్ని ప్రయోగాలు చేసి, రైతులకు అనువైన పద్దతులను వెలికితీయడం వల్ల తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించడం సాధ్యమవుతుంది.

Leave Your Comments

Tomato Health Benefits: టమాటాతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Previous article

Guava export rises: జామ ఎగుమతిలో పెరుగుదల

Next article

You may also like