తెలంగాణవార్తలు

వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్ లో ఘనంగా వ్యవసాయ విద్యా దినోత్సవం

0
      భారతదేశ మొదటి రాష్ట్రపతి, వ్యవసాయ శాఖ మంత్రి డాక్టర్ రాజేంద్రప్రసాద్ జయంతిని పురస్కరించుకొని వ్యవసాయ విద్యా దినోత్సవంను వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్ లో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీన్ ఆఫ్ పీజీ స్టడీస్, పరిశోధన సంచాలకులు డాక్టర్ రఘురామి రెడ్డి, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డి. శివాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ సి. నరేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో వివిధ విభాగాలు ఏర్పాటుచేసిన స్టాళ్ళను ప్రారంభించి సందర్శించారు. అలాగే వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులతో మాట్లాడుతూ ప్రతి విద్యార్థి వ్యవసాయం పైన మక్కువ పెంచుకోవాలని, చిన్నతనం నుంచి వ్యవసాయం ప్రాముఖ్యతను తెలుసుకొని మంచి పౌరులుగా మారాలని ముఖ్య అతిథి తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించటానికి పీజీ, పి.హెచ్.డి. విద్యార్థులు స్టాళ్ళను ఏర్పాటు చేసినందుకు వారిని  ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ పాఠశాలల నుంచి వచ్చిన  విద్యార్థులకు వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలు నిర్వహించి గెలిచిన వారికి ప్రోత్సాహక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ డీన్ నరేందర్ రెడ్డి, కళాశాల ఓ.ఎస్.ఏ డాక్టర్ ప్రశాంత్ వివిధ శాఖల అధిపతులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.  దాదాపు 27 పాఠశాలల నుంచి 2074 మంది విద్యార్థులు వివిధ స్టాళ్ళను, వ్యవసాయ కళాశాల క్షేత్రాలు సందర్శించి ఆసక్తిగా వివిధ అంశాలు తెలుసుకున్నారు.
Leave Your Comments

ఏరువాక ఫౌండేషన్ వ్యవసాయ వార్షిక అవార్డులు – 2023, ఆంధ్రప్రదేశ్ విజేతల జాబితా :

Previous article

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ శ్రీనివాసులు శెట్టిని  కలిసిన జయశంకర్ వర్శిటీ ఉపకులపతి ఆల్దాస్ జానయ్య

Next article

You may also like