NABARD: వ్యవసాయ రంగానికి, రైతులకు సేవలందిస్తూ ఆదాయం పొందడానికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. శాస్త్రీయ శిక్షణతోపాటు రుణమిచ్చి సాయం చేయడానికి అగ్రి క్లినిక్, వ్యవసాయ వాణిజ్య కేంద్రం పథకం అండగా నిలుస్తోంది. ACABC పథకాన్ని భారత ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది. అయితే ఈ పథకానికి NABARD సబ్సిడీ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది.

NABARD
పథకం లక్ష్యాలు:
వ్యవసాయ అభివృద్ధికి తోడ్పాటు, నిరుద్యోగ వ్యవసాయ గ్రాడ్యుయేట్లు, వ్యవసాయ డిప్లొమా హోల్డర్లు, వ్యవసాయంలో ఇంటర్మీడియట్ మరియు వ్యవసాయ సంబంధిత కోర్సులలో పీజీ ఉన్న బయోలాజికల్ సైన్స్ గ్రాడ్యుయేట్లకు లాభదాయకమైన స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించడం.
Also Read: వ్యవసాయ రంగ ముఖ్య పరిశోధన సంస్థలు
అగ్రి-క్లినిక్‌లు:
పంటలు,జంతువుల ఉత్పాదకతను పెంపొందించడానికి మరియు రైతుల ఆదాయాన్ని పెంచడానికి వివిధ అంశాలపై రైతులకు నిపుణుల సలహాలు మరియు సేవలను అందించడానికి అగ్రి-క్లినిక్‌లు రూపొందించారు. అగ్రి-క్లినిక్‌లు నేల ఆరోగ్యం, పంట పద్ధతులు, మొక్కల రక్షణ, పంట భీమా, పంటల సాంకేతికత, జంతువులకు వైద్య సేవలు, మేత మరియు మేత నిర్వహణ మార్కెట్‌లోని వివిధ పంటల ధరలు మొదలైన రంగాలలో సహాయాన్ని అందిస్తాయి: ప్రతి గ్రామంలో కనీసం ఒక అగ్రిక్లినిక్‌ను వ్యవసాయ పట్టభద్రులతో ఏర్పాటు చేయించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది.

Agri clinic and Agribusiness
ఈ పథకానికి గానూ వ్యవసాయం మేనేజ్‌మెంట్ ఒక సబ్జెక్టుగా డిగ్రీ పూర్తి చేసిన వారు , అగ్రికల్చర్ లో డిప్లమో పొందినవారు ఏసీ లేదా ఏబీసీ పెట్టుకుని రైతులకు సేవలు అందించవచ్చు. అయితే ఇక్కగా ఒక విషయాన్నీ గుర్తుంచుకోవాలి. ఇవి పెట్టుకోవడానికి ముందు రాజేంద్రనగర్‌లోని జాతీయ వ్యవసాయ విస్తరణ, నిర్వహణ సంస్థ లో లేకపోతే దాని అనుబంధ సంస్థలో 45 రోజుల శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏసీ, ఏబీసీ పెట్టుకుంటామనే వివరాలతో ప్రాజెక్టు నివేదిక రెడీ చేసుకుని అందుబాటులో ఉన్న బ్యాంకులో దరఖాస్తు చేయాలి. అయితే ఒకరికి అయితే రూ.20 లక్షలు లేదా ఐదుగురు కలసి ఏసీ లేదా ఏబీసీ పెట్టుకుంటే రూ.కోటి రుణం పొందుతారు. ఇందులో ఎస్సీ, ఎస్టీలకైతే రూ.44 లక్షలు, ఇతరులకైతే రూ.36 లక్షలు రాయితీ వస్తుంది.
Also Read: అధునాతన వ్యవసాయ యంత్రాలు