నాపేరు వియ్యపు వరలక్ష్మి మాది పొట్టి దొర పాలెంగ్రామం, బుచ్చియ్యపేట మండలం, అనకాపల్లిజిల్లా.నేను గతంలో వివిధ ప్రవేట్ కంపెనీల హైబ్రెడ్ విత్తనాలను బీర సాగు కోసం వినియోగించాను. కానీ ప్రతిసంవత్సరం విత్తనానికి పెట్టెఖర్చు అధికమవడంతో కృషివిజ్ఞాన కేంద్రం, కొండెంపూడి శాస్త్రవేత్తలు అందించిన అర్క ప్రసన్ అనే బీర రకాన్ని అందించారు.
కృషివిజ్ఞానకేంద్రం,కొండెంపూడి శాస్త్రవేత్తలు అందించిన అర్క ప్రసన్ అనే బీర రకాన్ని జూన్ మాసంలో విత్తుకోవడం జరిగింది. 50 సెంట్ల విస్తీర్ణంలో 700 గ్రాముల విత్తనాన్ని పందిరి సాగు విధానంలో రెండు వరసల మద్య 2 మీటర్ల దూరాన్ని అలాగే వరుసలో రెండు పాదుల మద్య 0.5 మీటర్ల దూరం ఉండేట్లుగా నాటుకున్నాము. డిప్ పద్దతిలో నీటిని అందించి, సరియైన సమయంలో కలుపు నివారణ చేపట్టాము. 2-4 ఆకుల దశలో ఉన్నపుడు లీటరు నీటికి 3 గ్రాముల బోరాక్స్ కలిపి పిచికారి చేయడం వలన ఆడ పుష్పాల సంఖ్య ఎక్కువై అధిక దిగుబడికి కారణం అయింది.అలాగే మొక్క పెరుగుదలకు ప్రతి 20 రోజులకు ఒకసారి 19:19:19 ద్రావనాన్ని ఒకలీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారి చేయడం జరిగింది.
సస్యరక్షణ:
ఆకులను, పూలను పూర్తిగా తినే పెంకు పురుగుల నివారణకు ప్రోపినోఫాస్ 2 మీ.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయడం జరిగినది. బూడిద తెగులు నివారణకు కార్బండిజం + మాంకోజెబ్2 మీ.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయడం వలన తెగులను కొంతవరకు అరికట్టడం జరిగింది.
బీరకాయలకోతవిత్తిన 60 రోజుల తరువాత మొదలైంది. ఆగస్టు మాసమంతా మార్కెట్లో మంచి గిరాకీ ఉండడం వలన బీర సాగు లాభదాయకంగా ఉన్నది, అలాగే విత్తనాన్ని తర్వాత సీజను కూడా వాడు కోవడంతో విత్తనఖర్చు ఆదాఅవుతుది.
ఎన్.సత్తిబాబు, పి.వి.యస్.రామునాయుడు, ఎన్.రాజకుమార్, పి.బాబు, ఎన్.కిశోర్, ఎ. సౌజన్య, పి.రాజేష్మరియువై.స్రవంతి.
కృషివిజ్ఞానకేంద్రం, కొండెంపూడి.
ఫోన్ : 86390 66690