Groundnut variety released from Tirupati: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి మారుతున్న వాతావరణ పరిస్థితులను తట్టుకొని, అధిక దిగుబడులను సాధించే దిశలో వేరుశనగలో ఐసీఏఆర్ కోణార్క్ (టీసీజీఎస్-1707) అనే కొత్త రకాన్ని తిరుపతి పరిశోధన స్థానంలో రూపొందించారు.ఈ రకం ఇటీవల ప్రధాని చేతుల మీదుగా విడుదల కావడం, ఏపీ నుంచి విడుదలైన మూడు వంగడాల్లో ఇదొకటి కావడం గర్వకారణం. ఈ రకం గుణగణాలు ఇలా ఉన్నాయి…
ఐసీఏఆర్ కోణార్క్ (టీసీజీఎస్-1707):
ఈ వేరుశనగ రకం ఖరీప్ కాలానికి అనుకూలమైనది. 110 నుంచి 115 రోజుల్లో పంటకొస్తుంది. ఎకరాకు 9.9 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. రసం పీల్చే పురుగులను తట్టుకుంటుంది. ఆకుమచ్చ, వేరుకుళ్లు, కాండంకుళ్లు, వేరు ఎండు తెగుళ్లను మధ్యస్థంగా తట్టుకుంటుంది. పప్పు దిగుబడి 70 నుంచి 75 శాతం ఉంటుంది. 49 శాతం నూనె దిగుబడి వస్తుంది. వంద గింజల బరువు 40 నుంచి 45 గ్రా. ఉంటుంది. 29 శాతం మాంసకృత్తులు ఉంటాయి. అధిక నీటి వినియోగ సామర్థ్యం గల రకం. కాయలన్నీ ఒకేసారి పక్వానికి వస్తాయి. గింజలు లేత గులాబీ రంగులో ఉంటాయి. ఒడిశా, పశ్చిమ బంగా రాష్ట్రాల్లో సాగుకు అనువైనది.
ALSO READ:Rabi Groundnut cultivation in scientific method: శాస్త్రీయ పద్దతిలో యాసంగి వేరుశనగ సాగు