3 kg of tomatoes for 100 rupees దేశవ్యాప్తంగా టమోటా పేరు మారుమ్రోగిపోతుంది. టమోటాలు కూరగాయల మార్కెట్లో కంటే ఎక్కువగా వార్తల్లోనే కనిపిస్తున్నాయి. టమాటా ధర వాయువేగంతో దూసుకెళ్తోంది. పెట్రోల్, డీజిల్ రేటు దాటేసింది. అసలే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ రేట్లు పెరిగి సామాన్యులు ఇబ్బంది పడుతుంటే తాజాగా కూరగాయల ధరలు వారికి చుక్కలు చూపిస్తున్నాయి. దీనికి తోడు సబ్బులు, సర్ఫులు, బిస్కెట్ల రేట్లు కూడా పెరిగాయి. దీంతో ప్రజలు ఏమి కొనలేకపోతున్నారు.
కొద్దిరోజుల క్రితం వరకు రూ. 10 లేదా రూ. 20కు దొరికిన కిలో టమోటాలు ఇప్పుడు వంద నోటు మీద కూర్చున్నాయి. దక్షిణాదిలోని అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. నవంబర్ నెలలో దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో నిరంతర భారీ వర్షాలు కురుస్తుండటంతో తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల సాధారణ జీవితానికి అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి టమోటాల దిగుమతులు నిలిచిపోవడంతో తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల్లో టమాటా ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. రూ.10, 20 ఉండే టమోటా ఒక్కసారిగా రూ.130,150 వరకు కొనసాగుతుంది. దీంతో ఈ ధరలను చూసి జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 kg of tomatoes for 100 rupees
Tamota వంటింట్లో టమోటా తప్పనిసరి అయింది. ఏ కూర వండినా టమాటా తగలాల్సిందే. ఇక ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కూడా కావడంతో టమాటాకు డిమాండ్ కూడా ఎక్కువే. అన్ని రెట్లు ఆకాశాన్నంటిన ప్రస్తుత పరిస్థితిలో వందరూపాయలు దాటిన టమాటా కొని వాడగలిగే అవకాశం చాలా తక్కువ మందికే ఉంటుంది. సామాన్యులకు ప్రస్తుతం టమాటా అంటే అత్యంత క్లిష్టమైన కూరగాయగా మారిపోయింది.
ఈ తరుణంలో టమోటా రూ.100 కి మూడు కిలోలు దొరికితే ఎలా ఉంటుంది?. క్షణంలో కాజేస్తారు వినియోగదారులు. హైదరాబాద్ లో నేడు అదే పరిస్థితి కనిపించింది. శుక్రవారం ఉదయం లక్డీకపూల్ లోటస్ ఆసుపత్రి సమీపంలో ఆటోపై వచ్చిన ఓ అమ్మకపు దారుడు రూ.100కి మూడు కిలోట టమాటాలంటూ బోర్డు పెట్టాడు. అతడిని చూసిన వినియోగదారులు క్షణాల్లోనే క్యూ కట్టేశారు. ఒక్కొక్కరు కిలోల కొద్దీ కొనుగోలు చేయడంతో కొద్ది సమయానికే తెచ్చిన టమాటో మొత్తం అయ్యిపోయాయి. మార్కెట్ లోనే కాదు ఎక్కడ చూసిన టమాటో కేజీ రూ. 130 పలుకుతుంటే ఇతడు ఎందుకు ఇంత తక్కువ ఇచ్చాడా అని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. Tamota Price Crossed Fuel Rates