PM Kisan Yojana: దేశవ్యాప్తంగా ఉన్న రైతుల్ని ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు ప్రవేశపెడుతున్నాయి. కేంద్రం రైతులకోసం పీఎం కిసాన్ యోజన పథకం కిందా రైతులకు మూడు విడతల వారీగా 20ty00 చొప్పున మొత్తం 6 వేలు ఆర్ధిక సాయం చేస్తుంది. అయితే ఏపీలో చాలా మంది రైతులకు పీఎం కిసాన్ పథకం అందడంలేదని తాజా సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో దాదాపు 15.2 లక్షల మంది రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని అందించే కేంద్ర ప్రాయోజిత పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద చెల్లింపు జరగలేదని తేలింది. వివరాలలోకి వెళితే..
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు ప్రతి సంవత్సరం రూ. 6,000 చొప్పున మూడు విడతలుగా ఒక్కొక్కరికి 2,000 అందిస్తుంది. కాగా పీఎం కిసాన్ 10వ విడత బదిలీ జనవరి1 2022 నుండి మొదలై ఫిబ్రవరి చివరి నాటికి పూర్తవుతుంది.
పీఎం కిసాన్ పథకంపై సర్వే వివరాలు:
దేశంలో పబ్లిక్ సర్వీస్ డెలివరీని మెరుగుపరచడానికి కృషి చేస్తున్న ఇంజనీర్లు, సామాజిక శాస్త్రవేత్తలు మరియు సామాజిక కార్యకర్తల బృందం ప్రాతినిధ్యం వహిస్తున్న లిబ్‌టెక్ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం పీఎం కిసాన్ యోజన కింద మొత్తం 59, 06,097 మంది రైతులు నమోదు చేసుకున్నారు. అయితే దాని అంచనా రూ. 96,03.3 కోట్లుగా ఉంది.
Also Read: పీఎం కిసాన్ క్రెడిట్ కార్డు పొందడం ఎలా..?
కాగా పీఎం కిసాన్ యోజన కిందా దాదాపు రూ. 82,03.7 కోట్లు లబ్ధిదారులకు అందగా ఇంకా 15 లక్షల మంది రైతులకు 13,43.5 కోట్లు అందాల్సి ఉంది. అయితే ఈ మొత్తం ఖాతా చెల్లింపులు లేదా ఆధార్ చెల్లింపుల ద్వారా ఫండ్ బదిలీ జరుగుతుంది. అనేక సందర్భాల్లో, లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు బదిలీ చేయబడిన డబ్బు సాంకేతిక సమస్యల కారణంగా జమ కావడంలేదు.
కాగా.. జూలై 2021లో బ్యాంక్ తిరస్కరణ, ఆధార్ ధృవీకరించబడని 33,562 రైతులపై జరిపిన సర్వేలో గత 6 నెలల్లో కేవలం 12.5 శాతం కేసులు మాత్రమే పరిష్కరం జరిగిందని సర్వే చెప్తుంది. ఈ విషయంలో వ్యవసాయ పరిశోధకుడు నవీన్ గజ్జలగారి మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ తప్పనిసరిగా మార్గదర్శకాలను రూపొందించాలని, అలాగే లబ్ధిదారులకు బకాయిపడిన వాటిని అందజేసేందుకు హామీ ఇవ్వడానికి వాటిని ఫ్రంట్‌లైన్ అధికారులతో పంచుకోవాలని సూచించారు. అలాగే చెల్లింపులను ఎందుకు నిలిపివేసారు అనే కారణాలను కూడా డిపార్ట్‌మెంట్ తప్పనిసరిగా తెలియజేయాలన్నారు. పిఎం కిసాన్ కింద నమోదు చేసుకోని రైతులను నమోదు చేసుకోవడానికి ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
Also Read: ఆధార్ ను పీఎం-కిసాన్ ఖాతాకు లింక్ చేశారా ?