Indian Agricultural Universities Association: రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వావిద్యాలయంలో రెండు రోజుల నుంచి జరుగుతున్న ఇండియన్ అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ అసోసియేషన్ (Indian Agricultural Universities Association) 14 వ జాతీయ సింపోజియం నేడు ముగిసింది. క్రియేటింగ్ ఎ నే బులింగ్ ఎకో సిస్టమ్ ఇన్ అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ ఫర్ అగ్రి టెక్ ఇన్నో్వేషన్స్ అన్న అంశం పై ఇది జరిగింది. దేశం నలు మూలల నుంచి అనేక వ్యవసాయ విశ్వవిద్యాలయాల ఉప కులపతులు, పరిశ్రమల ప్రతినిధులు దీనిలో పాల్గొన్నారు.
వివిధ అంశాల పై మొత్తం నాలుగు సెషన్లలో చర్చలు జరిగాయి. సుమారు 40 మంది వీటిలో పాల్గొన్నారు. ముగింపు సదస్సు లో ఐ ఏ యు ఏ అధ్యక్షులు ఆర్ కే మిట్టల్, గుజరాత్ లోని సర్దార్ దంతివాడ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆర్ ఎమ్ చౌహన్, పీ జే టీ ఎస్ యూ ఉపకులపతి వి. ప్రవీణ్ రావు లు ప్రసంగించారు. మారుతున్న పరిస్థితులు కి అనుగుణంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మారాలని ప్రవీణ్ రావు అన్నారు. కనీస స్థాయిలో వనరులు కల్గిన దక్షిణ కొరియా, తైవాన్ వంటి దేశాలు అభివృద్ది లో ఎలా దూసుకెళుతున్నాయో గమనించాలన్నారు.
Also Read: Hyderabad: జయశంకర్ వర్సిటీ కి ఐకార్ A గ్రేడ్ అక్రిడేషన్
సుస్థిరా భివ్రద్ది లక్ష్యాలు, వాతావరణ మార్పులు, పోష్టికాహారలోపం, భూ సార క్షీణత తదితర అంశాల పై ప్రత్యేక ద్రష్టి పెట్టాలన్నారు. జాతీయ విద్యా విధానం పరిధి లోనే వ్యవసాయ విద్య లోనూ మార్పులు రావాలని ప్రవీణ్ రావు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల లో వర్సిటీ ల బాధ్యతలు పెరుగుతున్నాయని ఆర్ ఎమ్ చౌహన్ అన్నారు. అందుబాటులోకి వస్తున్న కొత్త టెక్నాలజీ ల ఉపయోగాలు, ఇతర ప్రభావాల గురించి వర్సిటీ లు పరిశీలించాలని చౌహన్ అన్నారు. ఈ సింపోజియం లో వచ్చిన అభిప్రాయాలని క్రో డీకరిస్తూ త్వరలోనే ఐ ఏ యూ ఏ ఒక నివేదిక రూపొందించి ఐ కార్, ప్రభుత్వాలకి సమర్పిస్తామని ఆర్ కే మిట్టల్ తెలిపారు. కొత్త సవాళ్లు కి అనుగుణంగా శాస్త్రవేత్తలు, వ్యవసాయ విద్యార్థులు, రైతాంగం మారాల్సిన అవసరం ఉందని మిట్టల్ అన్నారు.
Also Read: Rabi Peanuts: రబీ వేరుశనగలో సస్యరక్షణ