Yellow Chilli: తెలుగు వంటకాలలో మిర్చి లేకుండా ఊహించలేము. ఇది మన వంటకాలలో సర్వసాధారణం. అయితే మనం వంటకాలలో ఉపయోగించే మిర్చి ఆకు పచ్చ రంగులో ఉంటుంది, పూర్తిగా పక్వానికి వచ్చాక ఎరుపు రంగుకు మారుతుంది. దీనిని మనం సూర్య రశ్మి లో ఎండబెట్టి కారం పొడిగా మారుతుంది. ఇది కూడా ఎరుపు రంగలోనే ఉంటుంది. అయితే ప్రస్తుత కాలంలో రైతులను పసుపు రంగు మిర్చి ఆకట్టుకుంటుంది. మొదటిగా ఇవి ఆకు పచ్చ రంగులో ఉండి పక్వ దశకు చేరుకోగానే పసుపు లేదా లేత నారింజ రంగుకు మారుతుంది.
పసుపు మిరపకాయలు ఎరుపు రంగు కాయల కన్నా మృదువుగా ఉంటాయి. ఈ మిరపకాయలు ఎర్ర మిర్చి కంటే కొంచం తీపిగా ఉండి, మిరియాల రుచిని పోలి ఉంటాయి.ఇవి 30 000 నుండి 50 000 స్కోవిల్లే హీట్ యూనిట్‌ల వరకు వేడిని పుట్టించగలవు. అలాగే మిగతా అన్ని మిరప రకాల కన్నా ఎక్కువ విటమిన్ సి కలిగి ఉంటాయి.
Also Read: మిరపలో కోత మరియు కోతానంతరం తీసుకోవాల్సి న జాగ్రత్తలు
ఈ మిర్చి సాగు సాధారణ ఎరుపు మిర్చి లానే ఉంటుంది. ఇందులో కూడా సన్న రకాలు, దొడ్డు రకాలు రెండు ఉన్నాయి. ఇది తెలుగు ప్రజలకు కొత్తేమీ కాదు. ఆంధ్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం అపర్ణ పేరుతో విడుదల చేసిన వంగడం కూడా పండిన తరువాత పసుపు రంగులోకి మారుతుంది. విత్తిన తరువాత మొలకలు ఆలస్యం గా రావచ్చు. 2-3 వారాలలో నాటుకోవడానికి సిద్ధం అవుతాయి. 1-1/2 కేజీ విత్తనం ఒక హెక్టారుకు సరిపోతుంది.
పసుపు మిరప సాగుకు 18 – 30 °C / 64 – 86 °F అత్యంత అనుకూలం. మిరపకాయలు మొలకెత్తడం కొంచెం నెమ్మదిగా ఉంటుంది. త్వరగా మొలకెత్తించడం కోసం 26 డిగ్రీ సెంటి గ్రేడ్ వద్ద ఉంచడం వలన త్వరగా మొలకెత్తించ వచ్చు. మిరప విత్తనాన్ని ½ అంగులం లోతులో నాటుకోవాలి.నారు సిద్ధం అయక మొక్కకు మొక్కకు మధ్య 45-60 సెంటీ మీటర్లు, వరుసకు వరుసకు మధ్య 45-60 సెంటీ మీటర్లు ఉండేలా నాటుకోవాలి. నర్సరీలో మాత్రం ఒక ప్రదేశంలో రెండు విత్తనాలను విత్తడం మంచిది. పువ్వులు మొక్క యొక్క కొన భాగంలో పూస్తాయి. కాబట్టి కొమ్మలకు ఎటువంటి హానీ చేయరాదు.
మీ మిరప పుష్పించే తర్వాత, పువ్వులు పరాగసంపర్కం చేయాలి. పువ్వులు పరాగసంపర్కం ద్వారా కాయలను ఏర్పసుస్తాయి. కావున స్ప్రింక్లర్ ను ఉపయోగించే రైతులు పుష్పించే సమయంలో వాడరాదు, ఒకవేళ స్ప్రింక్లర్ ఉపయోగించిన పూత రాలి కాయ ఎక్కువగా పట్టదు. దీనితో పాటు చీడ పీడలు అధికమవుతాయి.
మిరపకాయలు నాటిన 90 నుండి 120 రోజుల వరకు కోతకు సిద్ధం అవుతాయి. ఎల్లో చిల్లీ ఆకుపచ్చ రంగు నుండి పసుపు (నారింజ) కు మారుతుంది, కానీ ఇది ఆకుపచ్చగా ఉన్నప్పుడు ఎక్కువ కారం కలిగి ఉంటుంది. కలుపు, చీడ పీడల యాజమాన్యం సాధారణ మిర్చి లానే ఉంటుంది.
ఇది ప్రధానంగా పంజాబ్ మరియు దక్షిణ కాశ్మీర్ ప్రాంతాలలో ఎక్కువగా పండిస్తారు. స్టఫ్డ్ చిల్లీ వంటకాలు, డిప్స్, సాస్‌ల తయారీలో వంటలకు రంగు, కారం జొడించుటకు వాడే సుగంధ ద్రవ్యాలుగా విస్తృతంగా ఉపయోగిస్తారు. పసుపు కారం పొడిని శాఖాహారం మరియు మాంసాహార వంటలలో కూడా విస్తృతంగా ఉపయోగించవచ్చు. పసుపు మిరపలో యాంటీ బాక్టీరియల్, అనాల్జేసిక్ & యాంటీ డయాబెటిక్ లక్షణాలు పుష్కలం. ఊబకాయం ఉన్న రోగులలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి.
మార్కెట్ లో ఈ మిర్చికి మంచి ఆదరణ ఉంది; దీనికి కారణం డిమాండ్ కి సరిపడు ఉత్పత్తి లేకపోవడం. అయితే ప్రస్తుత మార్కెట్ అవగాహనతో ఈ రకం మిరప సాగు పెరుగుతుండడంతో మార్కెట్ ధరలు కూడా తగ్గుతూ రావడం గమనార్హం. మొదట్లో ఒక క్వింట ధర 60,000/- ఉండగా నేటి పరిస్తితిలో 16,500/- పలుకుతుంది.
Also Read: “రౌండ్ చిల్లి” ప్రపంచంలోనే ఘాటైన మిరపకాయలలో.. ఒకటి