వ్యవసాయ పంటలు

Late Sown Crops: ఆలస్యంగా విత్తేందుకు అనువైన పంటలు ఏవి.!

0
Ragi crop
Ragi crop

Late Sown Crops: ప్రధానంగా వేరుసెనగ, పెసలు, మినుములు, సోయాచిక్కుడు, నువ్వులు, పత్తి లాంటివి జూన్- జులై నెలల్లోనే విత్తుతారు. అయితే సన్న, చిన్నకారు రైతులు ఎక్కువ పెట్టుబడి పెట్టలేనివారు, సకాలంలో నైరుతి రుతుపవనాల వర్షాలకు పంటలు వేయలేనివారు ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చుతో పండించే పంటలు వేసుకొని స్థిరమైన నికర లాభం పొందవచ్చు. ఆలస్యమైనప్పుడు ప్రధాన పంటలు వేరుసెనగ, పత్తి లాంటివి వేయడానికి రైతులు ముందుకు రారు. వీటిలో పెట్టుబడి ఖర్చు అధికం దిగుబడులు కూడా ఆశించినంత వచ్చే అవకాశాలు చాలా తక్కువ.

Late sown crops

Late sown crops

వేసుకోదగ్గ పంటలు:
ఆలస్యంగా విత్తుకునేందుకు ఆహారధాన్య పంటల్లో జొన్న, సజ్జ, రాగి, పప్పుధాన్యాలలో కంది. అలసంద, అనప, నూనెగింజల్లో ఆముదం, పొద్దుతిరుగుడు, వలిసెలు, చిరుధాన్యాల్లో కొర్ర, అండుకొర్రలు అనువైనవి.

జొన్న: జొన్నను పశువుల మేతగా కూడా పండించుకోవచ్చు. జొన్నలో సి.ఎస్. హెచ్-16 సంకర రకం. పి.ఎస్. వి-1, సి.ఎస్.వి.15 రకాలు అనుకూలం. ఈ రకాలు 105-110 రోజుల్లో పంట వస్తాయి. ఎకరాకు సంకర రకం 15-17, రకాలు 10-12 క్వింటాళ్ల దిగుబడినిస్తాయి. ఎకరాకు 4 ట. పశువుల ఎరువుతో పాటు 50-70 5 యూరియా, 100 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 20 కి. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలి.

సజ్జ: విత్తనాలతో పాటు పశుగ్రాస పంటగా కూడా పండించుకోవచ -8209, రాజ్-271, ఐ.సి.ఎం.వి-155, ఎ.బి.వి-04 రకాలు: HHB – పి.హెచ్.బి.ఐ.సి.ఎం. హెచ్-356 సంకరాలు అనువైనవి.

Sajja Crop

Sajja Crop

విత్తడం: ఎకరానికి 2 కి. విత్తనాన్ని 45 సెం.మీ. × 12 సెం.మీ. ఎడం విత్తాలి. ఎరువులు: ఎకరాకు 4 ట. పశువుల ఎరువు, 26 కి. యూరియ 75 కి. సూపర్ పాస్ఫేట్, 15 కి. మ్యూరేట్ ఆఫ్ పొటాష్లను విత్తేటప్పు వేసి, విత్తిన 30-35 రోజులకు మరో 26 కి. యూరియా వేయాలి.

కలుపు మందులు: 800 గ్రా./ ఎకరానికి అట్రాజిన్ (4 గ్రా./లీ.) వివెంటనే నేలపై పిచికారి చేయాలి.

Also Read: Importance of Pulse Crops: పప్పు ధాన్యపు పంటల ప్రాముఖ్యత.!

రాగి: 100-115 రోజుల్లో పంట వచ్చే సప్తగిరి, భారతి, గోదావరి, వకు తిరుమల రకాలు అనువైనవి. ఎకరాకు 3-4 కిలోల విత్తనం వెదజల్లా విత్తిన 48 గంటల్లోగా పెండిమిథాలిన్ (3 మి.లీ./లీ.) పిచికారి చేసి కలు నివారించాలి. పైరు 20-25 రోజుల దశలో వచ్చే వెడల్పాకు కలు నివారణకు 2, 4-డి సోడియం లవణాన్ని (2 గ్రా./లీ.) పిచికారి చేయాలి

పప్పుధాన్యాలు: అతితక్కువ ఖర్చుతో తక్కువ కాల పరిమితి (60-75 రోజులు) లో దిగుబ పొందగలిగే వివిధ రకాల పప్పుజాతి ధాన్యాలు పండించడం ద్వా నేలసారాన్ని కాపాడుకోవడమే కాక, కావాల్సిన పశుగ్రాసం కూడా లభిస్తుం కంది: వెర్రితెగులు వచ్చే ప్రాంతంలో బి.ఆర్. జి-1, 2, 1CPL-7035, BSM 700 అనే రకాలు అనువైనవి. అమరావతి, పల్నాడు, లక్ష్మి, ఆశ, తిరుప కంది, టిఆర్.. 50 రకాలతో పాటు ఎండుతెగులు తట్టుకునే, ఆర్జిటి పిఆర్ఆ-176 (ఉజ్వల) రకాలు కూడా సాగు చేయవచ్చు. ఎకరాకు 2-3 కిలో విత్తనం వాడి తేలిక నేలల్లో 75-90 సెం.మీ. × 20 సెం.మీ. బరువునేలల్లో 120 సెం. మీ. 20 సెం.మీ. ఎడంగా విత్తాలి. కలుపు నివారణకు ఎకరాకు ఒక లీటరు అలాక్లోరన్ను విత్తిన వెంటనే నేలపై పిచికారి చేయాలి.

ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువుతో పాటు 17 కి. యూరియా – 125 కి. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా ఒక బస్తా డి.ఎ.పి. ఆఖరి దుక్కిలో వేయాలి. 15-20 రోజుల దశలో వత్తుగా ఉన్న కంది మొక్కలను పలుచగా చేయాలి. అలసంద: ఏడాది పొడవునా పండించడానికి అనువైన పప్పుజాతి పంట. ఇది పశువులకు ఇష్టమైన మేతగా కూడా పనికొస్తుంది. పచ్చిరొట్ట పైరుగా కూడా పనిచేస్తుంది. గింజల కోసం టి.పి.టి.సి-29, పూసా ఫల్గుణి, జి.సి-3, ఆర్కా గరిమ, సి-152 రకాలు, పచ్చిమేత కోసం ఐ.జి.ఎఫ్.ఆర్.ఐ-450, జి.ఎఫ్.సి L 2. 3. యు.పి.సి-5287, ఐ.ఎఫ్.సి.-8503, శ్వేత రకాలు అనువైనవి.

-Rakesh Jhadi
Ph.D. Research Scholar
Department of Agronomy
Bidhan Chandra Krishi Viswavidhyalaya
Contact no:9505410171

Also Read: Importance of Food Grain Crops: ఆహార ధాన్య పంటల ప్రాముఖ్యత.!

Also Watch:

Leave Your Comments

Mulching Importance: వ్యవసాయం లో మల్చింగ్ ప్రాముఖ్యత.!

Previous article

Sericulture: పట్టుపురుగు లలో సోకే సున్నపుకట్టు రోగం ఎలా వస్తుంది..!

Next article

You may also like