హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 10 వరకు వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండవచ్చు. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 19 నుంచి 22 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావచ్చు.
ఏయే పంటలు ఎప్పటి వరకు విత్తుకోవాలి ?
- రబీపంటలు విత్తుకోవడం అక్టోబరు నెల నుంచి మొదలవుతుంది. నవంబరు, డిసెంబరు మాసాల్లో దిగువ చూపిన పంటల్ని విత్తుకోవచ్చని రాజేంద్రనగలోని వ్యవసాయవాతావరణ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డా.ఎస్.జి. మహాదేవప్ప ఇలా తెలియజేస్తున్నారు.
- కుసుమ, శనగ, ఆవాల పంటలను నవంబరు 15వ తేదీ వరకు విత్తుకోవచ్చు.
- వేరుశనగ, బొబ్బర్లు పంటలను నవంబరు 30వ తేదీ వరకు విత్తుకోవచ్చు.
- మినుము, పెసర పంటలను డిసెంబరు 10వ తేదీ వరకు విత్తుకోవచ్చు.
- యాసంగి వరి నారుమళ్ళను నవంబరు 15వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ మధ్యలో పోసుకోవాలి.
- మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు పంటలను డిసెంబరు 31వ తేదీ వరకు విత్తుకోవచ్చు. పైన సూచించిన రబీ పంటలు సాగుచేయాలనుకునే రైతులు నాణ్యమైన విత్తనాలను ఎంపికచేసుకొని విత్తుకోవాలి.
Leave Your Comments