Green Gram Cultivation:పెసర పంటను, వర్షాకాలము, చలికాలము, వేసవిలోనే కాక, రెండుకాలాల మధ్య కూడా సాగు చేయవచ్చు. ఈ పంటను పచ్చిరొట్టపంటగా పెంచుతారు. వరిసాగుకు సరిపడినంత వర్షం పడకపోతే, పచ్చిరొట్ట పంటను, అలాగేపెంచి, దాని నుండి వచ్చే కాయలను తీసుకొని, మొక్కలను భూమిలోకి దున్నేస్తారు. దీనిని వర్షాధారంగా కూడా పండిస్తారు. ఈ పంటను శనగలోను అంతర పంటగా పండిస్తారు- బత్తాయి, మామిడి వంటి తోట పంటల లేతదశలో పెసరను అంతర పంటగా పండించి ఖాళీ భూమిని సద్వినియోగంచేస్తారు.
పెసర తక్కువ కాలం 60-70 రోజులు పంట, కాలం మారినా కూడా పండుతుంది. అందువలన అన్నికాలలోను ఖరీఫ్, రబీ, వేసవిలో కూడా పండించడానికి అనుకూలం. ఈ పంటను అన్ని రకాల పంటల తర్వాత పండించవచ్చు. క్షారభూముల్లోను, చేడు భూముల్లోను తప్ప అన్ని రకాల భూముల్లోనూ పండించవచ్చు. ఈ పంటను దక్షిన భారత దేశంలోని ఎర్ర భూముల నుండి మధ్యప్రదేశ్ లోని నల్ల రేగడి, రేగడి భూముల్లోను రాజస్థాన్ లోని ఇసుక భూముల్లోను పండిస్తున్నారు. గరప లేక ఇసుక తో కూడిన గరప నేలలు ఈ పంట పండించడానికి అత్యంత అనుకూలం. మురుగు నీరు నిల్వ ఉండే నేలలు పనికిరావు. తాత్కలికంగా నీరు నిలబడినా పంట దెబ్బతింటుంది. 3 సళ్ళు పెసర ఒక సాలు పత్తి లేక .ఖరీఫ్ లో 7 సళ్ళు పెసర, ఒక సాలు కందిపంట కూడా పండించవచ్చు.
Also Read: Castor Cultivation: ఆముదం సాగును దున్నుతున్న రైతులు.!

Green Gram Cultivation
ఒకసారి నాగలితోను, రెండుసార్లు గొఱ్ఱుతోను మెత్తగా దున్ని గుంటక తోలి నేలను తయారు చేయాలి. వరి కోసిన పొలాల్లో దుక్కి దున్నవలసిన అవసరం లేదు. ఆ పంటపొలాల్లో ఎకరాకు 6-7 కిలోలు తొలకరిలో, మాగాణిలో వరి కోతల తర్వాత, రబీలో, వేసవిలోని వరి మాగాణుల్లో 10-12 కిలోలు, వేసవిలో మెట్ట ప్రాంతాలకు 6-7 కిలోల విత్తనాలు విత్తుకోవాలి.
పురుగులు, రోగాలను తట్టుకునే రకాలను ఎంపిక చేయాలి. సొంతంగా విత్తానాలను తయారుచేసుకోని వాడుకొనే విధానముమీద శ్రద్ధవహించాలి. పెసర విత్తనాలను సొంతంగా పండించుకోవాలి లేదా నమ్మకస్తుల దగ్గర నుండి మాత్రమే కొనాలి. సొంత విత్తనాలు తయారు చేసుకుంటే డబ్బు బాగా ఆదా అవుతుంది.
కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బోసల్ఫాన్ మందును వాడి విత్తన శుద్ధి చేయాలి. ఈ పైరును కొత్తగా పండించేటప్పుడు, రైజోబియం కల్చరును విత్తనంతో కలిపి విత్తితే అధిక దిగుబడి పొందవచ్చు.
సేంద్రియ వ్యవసాయంలో:
కిలో విత్తనానికి 200 మి.లీ, బీజామృతం, 8గ్రా.ట్రైకోడెర్మావిరిడే తో శుద్ధి చేయాలి. తర్వాత విత్తనాన్ని నీడలో ఆరబెట్టాలి. తర్వాత రైజోబియమ్ లక్చరుతోను, పి.ఎస్.బి, తోను ఒకొక్క కిలో విత్తనాణికి ఒక్కొక్కటి 5 గ్రా శుద్ధి చేసి నీడలో ఆరబెట్టాలి. శుద్ధిచేసిన 4-6 గంటలలోపల విత్తాలి. బీజా మృతానికి బదులు పంచగవ్వ కూడా వాడవచ్చు. నీరు కలిపిన పంచగవ్వ లో 20 నిమషాల పాటు విత్తనాన్ని నాన బెట్టి తర్వాత ట్రైకోడెర్మాతో, పి.ఎస్. బితో, రైజోబియమ్ తో శుద్ధిచేయాలి.
మామూలు వ్యవసాయంలో:
కిలో విత్తనానిన్ని 30గ్రా. కార్బోసల్ఫాన్ తో శుద్ధిచేయాలి. కొత్తప్రాంతాల్లో పెసరపండించేటప్పుడు, సేంద్రియవ్యవసాయంలో గాని మామూలు వ్యవసాయంలో గాని, రైజోబియంతో శుద్ధిచేస్తే దిగుబడి తప్పకుండా పెరుగుతుంది.
పెసర వర్షాధారపు పంట. కాని వర్షాభావ పరిస్థితులేర్పడినప్పుడు ఒకటి, రెండు నీటి తడులు ఇస్తే మంచి దిగుబడులు పొందవచ్చు. వరి మాగాణుల్లో నీటి తడి అవసరం లేదు. రబీ వరి తర్వాత వేసవిలో పండించే పెసరకు 25-30 రోజుల దశలో ఒకసారి, 45- 50 రోజుల దశలో మరోసారి తేలిక పాటి తడులు ఇవ్వాలి.
పెండిమిథాలిన్ 30% ఎకరాకు 1.3-1.6 లీటర్లు లేదా అలాక్లోర్ 50% ఎకరాకు లీటరు చొప్పున విత్తిన వెంటనే గాని మరుసటి రోజుగాని పిచికారి చేయాలి. విత్తిన 20, 25 రోజులప్పుడు గొర్రుతో అంతరకృషి చేయాలి. మాగాణి పెసరలో ఊద నిర్మూలనకు పెనాక్సాప్రాప్ ఇథైల్ 9% ఎకరాకు 250 మి.లీ. చొప్పున విత్తిన 20, 25 రోజులప్పుడు 200 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి.
వర్షాకాలంలో కాయలను 1 లేక 2సార్లు ఏరి నూర్చుకోవాలి. చలి లేక ఎండకాలాల్లో మొక్కలను మొదలువరకు కోసి, ఎండిన తర్వాత నూర్చుకోవాలి. తర్వాత ఎండబెట్టి నిల్వచేసుకోవచ్చు. వర్షాధారంగా పండించిన పంటలో ఎకరాకు 1-2 క్వింటాళ్ళు నీటి పారుదల పంటలో 4-6 క్వింటాళ్ళు దిగుబడి వస్తుంది.
పెసర తేమను 10% కంటే తగ్గేవరకు ఎండబెట్టాలి. నిల్వలో పురుగులాశించకుండా ఆరిన వేపాకులను నలిపి, లేక భూడిద కలిపి గోనెసంచులలో పెసరను నిల్వచేయాలి. గోనె సంచులపై కూడా 5% వేపనూనె కలిపిన నీటిని స్ప్రేచేసి పురుగులనుండి రక్షించవచ్చు.
Also Read: Drone Subsidy: 50 శాతం సబ్సిడీపై రైతులకు డ్రోన్లను పంపిణీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.!