Redgram Varieties – పల్నాడు ( LRG 30)
మొక్క గుబురుగా పెరిగి కాపు మీద పక్కలకు వాలిపోతుంది. పువ్వులు పసుపు పచ్చగా ఉంటాయి. గింజలు మధ్యస్థ లావు గా గోధుమ రంగులో ఉంటాయి. మన రాష్టం లో అన్ని ప్రాంతాలకు అనువైన రకం. రబీ కీ కూడా అనుకూలం. ఎండు, తెగులు మరియు వెర్రి తెగులు ను తట్టుకోలేదు. ఇది ఖరీఫ్ 170-180 రోజుల పంట కాలం. దిగుబడి 8.8-10 క్వి / ఎ
మారుతీ ( ICPL 8863)
దీని పంట కాలం 160-165 రోజులు. మొక్క నీటరుగా పెరుగుతుంది.ఎండు తెగులు తట్టుకుంటుంది. గింజలు మధ్యస్థ లావుగా గోధుమ రంగులో ఉంటాయి. కాయ తోలుచు పురుగును కొంత వరకు తట్టుకుంటుంది. దిగుబడి 8 క్వి / ఎ కి వస్తుంది.
అభయ
మొక్కలు నీటరుగా పెరిగి కాయలు గుత్తులుగా కాస్తాయి. గింజలు మధ్యస్థ లావుగా గోధుమ రంగులో ఉంటాయి. దిగుబడి 8-8.5 క్వి / ఎ వస్తుంది.
లక్ష్మి ( IPCL 85063)
చెట్టు గుబురుగా ఉండి ఎక్కువ కొమ్మలు కలిగి ఉంటుంది. ఎండు తెగులు ను కొంత వరకు తట్టుకుంటుంది. రబీ లో విత్తినప్పుడు ప్రధానమైన కొమ్మలు ఎక్కువగా ఉండి ఎక్కువగా దిగుబడి ఇస్తుంది గింజలు లావుగా ముదురు గోధుమ రంగులో ఉంటాయి.
Also Read: Pests in Redgram Cultivation: కంది పంటను ఆశించు పురుగులు.!
HY 3 c
పంట కాలం 190-200 రోజుల వరకు ఉంటుంది. ఎర్ర పూత ఉండి, కాయలు వెడల్పు గా ఉంటాయి. గింజలు తెలుపు, పచ్చ గింజలను కూరగా ఉపయోగించవచ్చు. తెలంగాణ ప్రాంతానికి అనువైనది. ఎండు తెగులు మరియు వెర్రి తెగులు తట్టుకుంటుంది.
MRG 66
దీని పంట కాలం 180 రోజులు.ఖరిఫ్ మొక్క. దిగుబడి 8.8-9.6 క్వి / ఏ వస్తుంది. సాధారణంగా నల్ల రెగడి భూములకు అనువైనది. గింజలు మధ్యస్థం గా ఉంటాయి..మాక్రోఫోమీనా తెగులును కొంత వరకు తట్టుకుంటుంది.
LRG 38
మొక్కలు ఎత్తుగా గుబురుగా పెరుగుతాయి. పువ్వులు పసుపు పచ్చ గా ఉంటాయి. గింజలు లావుగా, గోధుమ రంగులో ఉంటాయి. తొలకరి రబీ కి అనుకూలం. దిగుబడి 8- 8.8 క్వి / ఏ. పంట కాలం 120-130 రోజుల వరకు ఉంటుంది.
WRG 27
మొక్కలు ఎత్తుగా పెరుగుతాయి. పువ్వులు ఎరుపు గా ఉంటాయి. కాయలు ఆకు పచ్చగా ముదురు గోధుమ రంగు చారలు కలిగి ఉంటాయి. దిగుబడి 8-8.8 క్వి. పంట కాలం 130 రోజులు.
దుర్గ ( IPCL 84031)
అధిక దిగుబడి నిచ్చు స్వల్ప కాలిక రకం . కాయ తోలుచు పురుగు బారి నుండి తప్పించుకుంటుంది. పంట కాలం 115-125 రోజులు. దిగుబడి 4-8.6 క్వి / ఎ
PRG 100
ఎండు తెగులును కొంత వరకు తట్టుకుంటుంది తెలంగాణ మరియు రాయలసీమ లోని కొన్ని తేలిక పాటి, ఎర్ర చల్కా నేలల్లో వర్షాధారం గా సాగు చేయడానికి అనువైనది. పంట కాలం దాదాపు 145-150 రోజులు.. దిగుబడి 8 క్వి / ఏ. వస్తుంది.
Also Read: Redgram Harvesting: కందిపంట కోత మరియు నిల్వ పద్ధతులు.!