Green gram Varieties: LGG 407 – మొక్కలు నీటరుగా పెరిగి కాయలు మొక్కలపై భాగం ల్లో కాస్తాయి. గింజలు మెరుస్తూ మధ్యస్థ లావుగా ఉంటాయి. ఎల్లో మొజాయిక్, నల్ల ఆకు మచ్చ తెగులును తట్టుకుంటుంది. చెట్టు కూడా కొంత వరకు తట్టుకుంటుంది. మొక్కలు నీటరుగా పెరుగుతాయి.
LGG 410
పంట కాలం 70-75 రోజులు. మొక్కలు నీటరుగా గుబురుగా పెరుగుతాయి. గింజలు మెరుస్తూ ఎల్లో మొజాయిక్ ను తట్టుకుంటుంది. ఒకే సారి కోతకు వస్తుంది. దిగుబడి 5.6-6.4 క్వి.
LRG 450 పుష్కర
మొక్కలు మధ్యస్థ ఎత్తులో ఉండి గుబురుగా కనిపిస్తాయి. మొక్క పంట వచ్చే సమయం లో వర్షాలు కురిసినప్పటికి కాయలోని గింజలు కొంత వరకు పాడవ కుండా ఉంటాయి. పంట కాలం 65-70 రోజులు 5.6-6.5 దిగుబడినిస్తుంది.
MGG 295
మొక్కలు నీటరుగా పెరుగుతాయి. కాపు మొక్క పై భాగంలో ఉండి గింజ మధ్యస్థ లావుగా సాధారణంగా ఉంటుంది. నల్ల మచ్చ తెగులును తట్టుకుంటుంది. మొవ్వు కుళ్లు తెగుళ్లును కొంత వరకు తట్టుకుంటుంది.పంట కాలం 60-65 రోజులు.
WGG 37 ఏక శీల
గింజలు ఆకర్షణీయంగా పచ్చ గా మెరుస్తూ ఉంటాయి పంట కాలం 60-70 రోజుల వరకు ఉంటుంది. రాష్టం అంత ఏక శిలి అన్ని కాలాల్లో పడించడానికి అనువైనది. దిగుబడి 4.8 -5.6 క్వి /హె వరకు వస్తుంది.
Also Read: Green gram cultivation: పెసర పంటలో పొగాకు లద్దె పురుగు యాజమాన్యం
WGG 2
గింజలు నీటరుగా ఉండి గుబురుగా పెరుగుతాయి. పంట కాలం 60-65 రోజుల వరకు ఉంటుంది. దిగుబడి 4.8-5.6 క్వి.గింజలు మెరుస్తూ ఉంటాయి. నల్ల మచ్చ తెగుళ్లును తట్టుకుంటుంది.
LGG 460
కాయలు గుత్తులు గుత్తులు గా పై భాగం లో ఉండి కాయడానికి సులువుగా ఉంటుంది. ఒకే సారి కోతకు వస్తుంది. దిగుబడి 4.8-6.0 క్వి. వరకు వస్తుంది. పల్లాకు తెగులును తట్టుకుంటుంది. మొవ్వు కుళ్లు తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. పంట కాలం 60-65 రోజుల వరకు ఉంటుంది .
ML
రాష్టం ల్లో అన్ని ప్రాంతాలకు అనువైనది. నీటరుగా పెరుగుతుంది. కాయలు గుత్తులు గుత్తులుగా, కాయ గింజలు చిన్నవిగా ఉంటాయి.
PS
ఒకే సారి పంటకు వస్తుంది. పచ్చగా మెరుస్తుంది. రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలకు అనువైనది.
POOSA 105
రాష్ట్రం లో అన్ని ప్రాంతాల్లో అనుకూలంగా ఉంటుంది. కాపు మొక్క పై భాగం నుండి ఉంటుంది. ఒకే సారి కోతకు వస్తుంది. గింజలు మధ్యస్థ లావుగా మెరుస్తూ ఉంటాయి. పల్లాకు తెగులు, ఆకు మచ్చ తెగుళ్ళు కొంత వరకు తట్టుకుంటుంది.
K851
మొక్క గుబురుగా పెరిగి ఎక్కువ చోటును ఆక్రమిస్తుంది. కాయలు పొడవుగా పెరిగి గుత్తులు కలిగి ఉంటాయి. గింజలు మధ్యస్థ లావుగా మెరుస్తూ ఉంటాయి. ఒకే సారి కోతకు వస్తుంది. నల్ల మచ్చ తెగులు, మరియు బూడిద తెగులు తట్టుకోలేదు.
MGG 348
పంట కాలం 65 రోజులు ఉంటుంది. మొక్క పొట్టిగా ఉండి అంతర పంటలకు అనుకూలంగా ఉంటుంది.
Also Read: Management of Green Gram and Black Gram:పెసర, మినుము యాజమాన్య పద్ధతులు.!