Types of Castor Oil: ఆముదం నూనెను ఎలా వాడాలి ? ఎటువంటి ఆముదాన్ని వాడాలి ? అనేది చాలామందికి సహజంగా వచ్చే అనుమానం. ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం! ఆముదం లో మూడు రకాలు ఉంటాయి. అవి సహజ ఆముదం, జమైకా నల్ల ఆముదం మరియు హైడ్రోజనేటెడ్ ఆముదం.
Also Read: Banned Plant Protection Products Till2022: భారతదేశంలో నిషేధించబడిన పురుగుమందులు.!
ఆర్గానిక్/కోల్డ్ ప్రెస్డ్ కాస్టర్ ఆయిల్:
సేంద్రీయ ఆముదం నూనెను గింజలను వేడి చేయకుండా నేరుగా ఆ గింజల యాంత్రిక పద్దతిలో రసాయనాలను ఉపయేగించకుండ నుండి సంగ్రహిస్తారు. ఇది పసుపు రంగులో ఉంటుంది. రింగుల జుట్టు ఉన్నవారు మరియు చికాకు, దురద కలిగించే పొడి చర్మం కలిగిన వారు తక్కువ ఆల్కలీన్ ఉన్న హెక్సాన్ రహిత సహజ ఆముదాన్ని వాడటం చాలా మెరుగైనది.ఇది జమైకా నల్ల ఆముదం కంటే తక్కువ ఆల్కలీన్ కలిగి ఉంటుంది.
జమైకా నల్ల ఆముదం: దీనిలో ముందుగా గింజలను వేయిస్తారు తరువాత ఆ గింజల నుండి నూనెను తీస్తారు. అలా కాల్చినఆముదపుగింజలపొడిని నలుపు రంగు రావడం కోసం మళ్ళి ఈ చిక్కటి నూనెలో కలుపుతారు. ఈ నూనెను ఆరోగ్యవంతమైన తల మెత్తని జుట్టు, ఉన్నవారు దీనిని వాడవచ్చు.
హైడ్రోజినేటెడ్ ఆముదం (ఆముదపు మైనం) : హైడ్రోజనేటెడ్ కాస్టర్ ఆయిల్‌ను దీనినే కాస్టర్ వ్యాక్స్ అని కూడా పిలుస్తారు.ఇది తెలుపు రంగులో ఉన్న కూరగాయల మైనం. దీనిని ప్రతిచర్య రేటును పెంచడానికి నికెల్ ఉత్ప్రేరకం సమక్షంలో స్వచ్ఛమైన ఆముదం యొక్క హైడ్రోజనేషన్ పద్ధతి ద్వారా ఉత్పత్తిచేస్తారు.ఆముదం మైనాన్ని పాలిష్‌లలో, ఆయిల్ పెయింట్స్లో, సౌందర్య సాధనాలలో, ఎలక్ట్రికల్ కెపాసిటర్లు, కార్బన్ పేపర్ మొదలైన తయారీలో వాడతారు.
సాధారణ ఆముదంలా కాకుండా ఈ మైనం, పెళుసైనది ఎలాంటి వాసన లేనిది మరియు నీటిలో కరగదు.
జమైకా నల్ల ఆముదం మరియు ఆర్గానిక్ ఆముదం ఒకే విధమైన పోషక విలువలు కలిగి ఉంటాయి కాని ఆర్గానిక్ ఆముదం తక్కువ ఆల్కలీగా ఉంటుంది.జమైకన్ బ్లాక్ కాస్టర్ ఆయిల్ తలపై రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, తద్వారా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.ఈ నూనె తలకు పోషణను అందిస్తుంది, జుట్టు మూలాలను బలోపేతం చేస్తుంది మరియు జుట్టు పల్చబడకుండా చికిత్స చేస్తుంది. ఇది మన జుట్టును మందంగా, నిండుగా మరియు మెరిసేలా చేయడానికి తోడ్పడుతుంది.
కోల్డ్-ప్రెస్డ్ క్యాస్టర్ ఆయిల్ ప్రధానంగా హెయిర్ షాఫ్ట్‌పై పనిచేస్తూ మెరిసే ఒత్తైన జుట్టును అందిస్తుంది. అంతేకాకుండా జమైకన్ ఆముదం నూనె సహజ ఆముదం నూనె కన్నా కాస్త చిక్కగా ఉంటుంది.
ఏ మార్పైనా రాత్రికి రాత్రే రాదు. కావున ఒకసారి వాడి వదిలేయడం కాన్నా కొన్నాళ్ల పాటు వాడితే క్రమక్రమంగా మార్పును మనం గమనించవచ్చు.
Also Read: Management of American Bollworm- పత్తిలో శనగ పచ్చ పురుగు ఇలా చేస్తే రాదు.