Expensive Mushrooms: కిలో పుట్టగొడుగుల ధర లగ్జీరీ కారు ధరతో సమానంగా ఉంది. అని ఎవరైనా చెబితే నమ్మడం కష్టమే. అయితే నమ్మి తీరాల్సిందే. దేశంలో లభించే అనేక రకాల పుట్టగొడుగులు కిలో రూ.300 నుంచి రూ.500 ధరలో లభిస్తున్నాయి. మరి వీటి ప్రత్యేకత ఏమిటి? అంత రేటు ఎందుకు పలుకుతున్నాయి. అనేగా మీ అనుమానం. తెలుసుకుందాం రండి.
ఖరీదైన పుట్టగొడుగులు
బీహార్‌లని చాలా మంది రైతుల జీవితాలను పుట్టగొడుగుల పెంపకం మార్చేశాయి. పుట్టగొడుగులు విక్రయిస్తూ వారు లక్షలు ఆర్జిస్తున్నారు. ఎందుకంటే వారు పెంచే పుట్టగొడుగులు ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటాయి. సహజంగా రూ.300 ఉంటే పుట్టగొడుగులు చాలా మంది రుచి చూసి ఉంటారు. కానీ బీహార్ రైతులు పండిస్తున్న పుట్టగొడుగులు గురించి తెలుసుకుందాం.
యూరోపియన్ వైట్ ట్రిపుల్ మష్రూమ్
ఈ పుట్టగొడుగులు పేరు చెబితే పెద్దగా పట్టించుకోక పోవచ్చు. కానీ వీటి ధర చెబితే మాత్రం సామాన్యులే కాదు ధనికులు కూడా నోరెళ్లబెట్టడం కాయం. యూరోపియన్ వైట్ ట్రిపుల్ మష్రూమ్ ఈ పేరు చాలా మందికి కొత్తగా అనిపించొచ్చు. ఇవి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధర కిలో రూ. 8 నుంచి 9 లక్షల పలుకుతున్నాయి. వీటిని సాగు చేయరు. ప్రకృతి ప్రసాదించిన పుట్టగొడుగులు పాత చెట్లపై స్వయంగా పెరుగుతాయి. వీటిని అనేక వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. అందుకే వీటికి అంత ధర పలుకుతుందని రైతులు చెబుతున్నారు.
Also Read: Rainy Season Suitable Crops: ప్రస్తుత్త వర్షాలకు వేసుకోదగ్గ పంటలు
మాట్సుటేక్ పుట్టగొడుగు
ఈ రకం పుట్టగొడుగులు ధర పరంగా మరేవీ సాటిరావు. వీటి ధర లక్షల్లో పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధర రూ.3 నుంచి రూ.5 లక్షలు పలుకుతోంది. మాట్సు టేక్ పుట్టగొడుగు సువానలో దీనికి సాటి లేదు. ఇది గోధుమ రంగులో ఉంటుంది. దీనిలో కూర చేస్తే అత్యంత రుచిగా ఉంటుంది. ఇక్క సారి రుచి చూస్తే ఇక వదలలేరు.
చాంటెల్ పుట్టగొడుగులు
ఇది కూడా సాగు చేసే వెరైటీ కాదు. సహజ సిద్దంగా లభిస్తుంది. అడవుల్లో అదే తయారవుతుంది. చాంటెరెల్ పుట్టగొడుగులు ప్రపంచంలో చాలా దేశాల్లో లభించవు. యూరప్, ఉక్రెయిన్ బీచ్ లలో మాత్రమే ఇవి లభిస్తాయి. చాంటెరెట్ పుట్టగొడుగులు అనేక రంగుల్లో దొరుకుతాయి. అయితే పసుపు రంగు పుట్టగొడుగులకు మంచి ధర లభిస్తుంది.కిలో రూ. 30 వేల నుంచి రూ. 40 వేల ధరకు ఇవి లభిస్తాయి.
బ్లాక్ ట్రిపుల్ పుట్టగొడుగులు
వీటి పేరులోనే వీటి రంగు బయట పడుతోంది. ఐరోపా దేశాల్లో వీటికి మంచి డిమాండ్ ఉంది. ఇవి చాలా ఖరీదైనవి. విదేశాల్లో బ్లాక్ ట్రిపుల్ మష్రూమ్ ధర కిలో రూ. లక్ష నుంచి రూ.2 లక్షల వరకు పలుకుతోంది.
గుచ్చి పుట్టగొడుగులు
హిమాలయ ప్రాంతంలో దొరికే అరుదైన రకం. ఇవి సాగు చేసే రకాలు కాదు. పర్వతాల్లో చెట్లకు లభిస్తాయి. మెత్తగా దూదిలా ఉంటాయి. అందుకే వాటిని స్పాంజ్ పుట్టగొడుగులు అని కూడా అంటారు. విదేశాల్లో వీటి ధర కిలో రూ.25 నుంచి రూ.30 వేల వరకు పలుకుతోంది.
Also Read: Cabbage – Onion Prices: ఉల్లిగడ్డ ధర పెరిగితే .. ఈ కూరగాయ ధర కూడా పెరుగుతుంది.!