Miyazaki Mango: మనం తినే అన్ని పండ్లలో రారాజు మామిడి పండు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొదలైన ప్రాంతాల్లో అందరికి అందుబాటులో ఉంది. మామిడి పండు కేవలం వేసవి కాలంలో అందుబాటులో ఉంటాయి. వేరే పండ్లతో పోలిస్తే మామిడి పండు రుచి మధురంగా ఉంటుంది. మనకు తెలిసిన మామిడి పండ్ల రకాలు బంగినపల్లి, రసాలు, కలెక్టర్ కాయ, కొబ్బరి మామిడి, పండూరు మామిడి, హిమాన్షు పసంద్ ఇలా చాలా రకాలు మామిడి పండులో ఉన్నాయి. మామిడి పంట సాగుకు ఈదురు గాలులు, ఆకాల వర్షాలు ఫై ఆధార పడి ఉంటాయి. మామిడి పండు రకాన్ని, నాణ్యతని బట్టి కిలోకి 200-1000 రూపాయలు రేట్ ఉంది.
మియాజాకీ అనే మామిడి రకం ప్రపంచంలోనే చాలా అరుదుగా దొరుకుతుంది. మియాజాకీ రకం ఎక్కువగా జపాన్ దేశంలో పండిస్తారు. మియాజాకీ మామిడి రకం కిలో ధర 2. 70 లక్షలు. ఈ మామిడి రకానికి మంచి ధర ఉండటంతో కాకినాడ జిల్లాలో కిషోర్ అనే రైతు సాగు చేయడం మొదలు పెట్టారు. ఈ రైతు వేరే దేశాల నుంచి అరుదుగా దొరికే పండ్లను అతనికి ఉండే 4 ఎకరాల పొలంలో పండిస్తున్నాడు.
Also Read: Vanilla Crop: ఒక పంటతో రైతులు కోటీశ్వరులు అవుతారు.!
మియాజాకీ మామిడిలో బీటా కెరోటిన్, ఫోలిక్ యాసిడ్, యాంటీ ఆసిడ్స్ పోషకాలు 15 శాతం ఎక్కువ ఈ మామిడి రకంలో ఉంటాయి. కిషోర్ గారు మియాజాకీ మామిడి రకం 4 మొక్కలకి పెంచగా అందులో పోయిన సంవత్సరం ఒకే పండు కాసింది. ఈ సంవత్సరం పండ్లు బాగా కాయడంతో మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఒక మామిడి పండు బరువు 300 గ్రాములు, కిలోకి 3-4 పండ్లు వస్తాయి.
ఈ పండ్లకి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉన్న ఈ పండ్లని అమ్మకుండా బంధువులకి, పెద్దలకి ఉచితంగా ఇస్తున్నారు. అతను పండించే పండ్లు ఆర్గానిక్ పద్దతిలోనే సాగు చేస్తున్నారు. ఇంటర్నెట్లో చూసి పండ్ల మొక్కలని ఆర్గానిక్ పద్దతిలో ఎలా పండించాలో తెలుసుకొని ఈ పండ్ల మొక్కలని పెంచడం మొదలు పెట్టారు. ప్రపంచంలోనే అరుదుగా దొరికే మియాజాకి (జపాన్ మామిడి ), థాయిలాండ్లో దొరికే 5కేజీల మామిడి, ఎర్ర పనాస, సంవత్సరం మొత్తం కాసే మామిడి రకం, యాపిల్ మామిడి, బ్లాక్ మెంగో, బననా మేంగో, అరటి సపోటా, ఇండోనేషియాలో దొరికే తెల్ల నేరేడు, మరో 40 రకాల పండ్ల మొక్కలను సాగు చేస్తున్నారు. అందరూ రైతులు ఆర్గానిక్ పద్దతిలో మొక్కలు సాగు చేయాలి అన్ని కిషోర్ గారు ఈ పండ్లను సాగు చేయడం మొదలు పెట్టారు. వచ్చే సంవత్సరం వరకి మరో 80 అరుదైన రకాల పండ్లు సాగు చేస్తారు.
Also Read: Subabul Crop: సుబాబుల్ పంట వేసుకొనే రైతులకు సూచనలు.!