Tomato Farmers: నిన్న మొన్నటి వరకు 200, 300 పలికిన టమాటా ధరలు నేడు పశువులకు ఆహారంగా మారుతున్నాయి. కొన్ని చోట్ల పంట అంతా రోడ్డు పాలవుతోంది. మూడు నెలల కిందట 300 పలికిన ధరలు నేడు 30 పైసలకు కూడా కొనే దిక్కు పంట లేక నేల పాలవుతోంది. పంట పండించే రైతులు గిట్టుబాటు ధర లేక మార్కెట్ కి అయ్యే రవాణా చార్జీలు కూడా రావని ఉద్దేశంతో పంటను పశువులకు వదిలి వేస్తున్నారు.
రాయలసీమ నుంచి టమోటాలు కొని ఎగుమతి చేస్తూంటారు. అయితే టమాటా ధర పాతాళానికి పడిపోయింది. కేవలం 25 కేజీల బాక్స్ 10 రూపాయల నుంచి 35 రూపాయలు వరకు పలుకుతోందని అంటే కేజీ టమాటా ధర దాదాపు 30 నుంచి 40 పైసలు పలుకుతోందని దీంతో గిట్టుబాటు ధరలు లేక రోడ్లపై రైతులు టమాటాలను పారబోస్తున్నారు. గత జూన్ నుండి అమాంతం పెరిగిన ధరలను రైతులు ఎంతో ఉత్సాహంతో టమాటా సాగును పెంచారు. తీరా రేట్లు ఇలా పడిపోవడంతో రైతులు డీలా పడిపోతున్నారు.
గత మూడు నెలలో టమాటా ధరలు రైతులను కోటిశ్వర్లను చేసింది. పంటను కాపాడుకోవడానికి సీసీ కెమోరాలు, పోలీసులు, సెక్యూరిటీని పెట్టుకుని మరీ పంటను రైతులు కాపాడుకున్నారు. నైలాన్ తెరను కూడా వాడుకున్నారు. అంతేకాకుండా టమాటాతో లగ్జరీ కారు కూడా కొన్నారు. టమాటాలతో ఎంతో మంది లక్షాధికారులు అయ్యారు. కొంత వరకు టమాటా రైతులకు కాసుల వర్షం కురిపిస్తోంది.
Also Read: Heavy Rains Damage Crops: పంటలపై అధిక వర్షాల ప్రభావం – నష్ట నివారణకు యాజమాన్యం
టమోటా కు ఇంత ధర ఎప్పుడూ లేదని, చాలా డబ్బు సంపాదించామని తెలిపారు. ప్రస్తుతం టమాటా రైతులను బికారిని చేస్తోంది. టమోటా రైతుకు కంటతడి పెట్టిస్తోంది. గిట్టుబాటు ధర లేక పూర్తిగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. పలు ప్రాంతాల నుంచి టన్నుల కొద్దీ పంట వస్తుండటం, ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలుదారులు రాకపోవడంతో.. టమాటా ధర ఒక్కసారిగా పడిపోయింది.
పంటకు పెట్టుబడి, ఎరువులు, కూలీల ఖర్చులు కూడా పూడ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు అంటున్నారు. కొన్ని రోజుల పాటు వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఇప్పుడు ఆకాల వర్షాలు పంటను దెబ్బతీస్తున్నాయని అంటున్నారు. టమాటా లో హెచ్చుతగ్గులు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మధ్యలో దళారులు తమను దోచుకుంటున్నారని టమాటా రైతులు అంటున్నారు.
Also Read: Terrace Cauliflower Farming: డాబాపై కాలీఫ్లవర్ ను పెంచుతున్న రైతులు.!