Maize(Corn) Products and Varieties:
- మొక్క జొన్న ఆకులు, కాండం , సైలేజ్ గాను, పేపర్ తయారీలో నూ రాపింగ్ (wrapping ) ఎండిన తర్వాత మొత్తం మొక్క వంట చెరకు గాను సాయిల్ కండిషనర్ గాను ఉపయోగపడుతుంది.
- మొక్క జొన్న ఈ దశ లోనైనా పశువుల మేతగాను, పూత దశలో కాయకూర గాను , పాలు పోసుకొనే దశలో కాల్చి తినే కండె గాను, గింజ ముదిరిన తర్వాత అనేక రకాల పరిశ్రమల్లో ముడి సరుకుగా వాడబడుతుంది.
- విత్తనం పశువుల కోళ్ళ దాణా గా, బిస్కెట్ మరియు బేకరీలో వాడబడుచున్నవి.
- గింజ నుండి స్టార్చి, గ్లూకోజ్, సుక్రోజ్, డెక్స్తరోజ్, సెల్యులోజ్, గమ్స్ మొదలైన రసాయన పదార్ధాలు తయారు చేయవచ్చు.
- మొక్క జొన్న నుండి ఆల్కహల్, ఇథనాల్, వంటి రసాయన పదార్ధాలు తయారు చేయవచ్చు.
- మొక్క జొన్న నూనెను అనేక దేశాల్లో పంట నూనెగా వాడుచున్నారు. ఇది హృదయ సంబంధిత రోగాలకు మంచిది . ఈ నూనెలో లినోలిక్, మరియు ఒలియిక్ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. కోలస్ట్రాల్ తక్కువగా ఉంటుంది.
- కార్న్ ఫ్లాక్స్, సూప్ మిక్స్, ఇన్ స్టాంట్ కార్న్స్, పఫ్స్, ఉప్మా మిక్స్, కేసరి బాదం….. మొదలైన అనేక కారపు తీపి పిండి పదార్ధాలు తయారు చేసుకోవచ్చు.
Also Read: Corn Oil Health Benefits: మొక్కజొన్న నూనెతో ఆరోగ్యం మిన్నా!
మొక్క జొన్న రకాలు:
- DHM-103 దీని పంట కాలం 105-120 రోజులు కొమ్మ కాండం కుళ్ళు తెగులును తట్టుకోగలదు. దిగుబడి ఎకరానికి 22-25 క్వి వస్తుంది.
- DHM – 105 దీని పంట కాలం 105-120 ఆకు మాడు, ముక్కు కుళ్ళు తెగుళ్లను నివారిస్తుంది. స్థిరమైన అధిక దిగుబడి ని ఇచ్చును.
- DHM- 1 ఇది స్వల్ప కాలిక హైబ్రిడ్, ఆకు మాడు తెగులును సమర్ధవంతంగా నివారిస్తుంది. పంట కాలం 85-90 రోజులు దిగుబడి 18-20 క్వి వరకు వస్తుంది.
- DHM-107 పంట కాలం 88-95 రోజులు ఇది మధ్య కాలిక హైబ్రిడ్, సంకర జాతి వంగడం దిగుబడి 22-25 క్వి. దిగుబడి వస్తుంది.
- DHM – 109 పంట కాలం 85-90 రోజులు దిగుబడి 22-25 క్వి / ఏ.
- త్రిసులత దీని పంట కాలం 105-120 డేస్ మొక్క కుళ్ళు తెగులును తట్టుకోగలదు. దిగుబడి ఎకరానికి 25-30క్వి వరకు వస్తుంది.
- అశ్విని, హర్ష, వరుణ్ ఈ రకాలు వర్ష ధార పరిస్థితులకు అనుకూలం, మేలైన అధిక దిగుబడి ఇస్తుంది.18-20 క్వి. పంట కాలం 90-100 రోజులు.
- అంబర్ పాప్ కార్న్ ఈ రకం పేలాలు చేయడానికి అనుకూలం పంట కాలం 95-100 రోజులు. మరియు దిగుబడి 18-20 క్వి వరకు వస్తుంది.
- మాధురి రకం 65-70 రోజుల పంట కాలం. తీపి కండె రకం 30-35% చెక్కెర కలిగి , ఉడికించి తినుటకు అనుకూలం. దిగుబడి ఎకరకు 30-35 క్వి కండే వరకు వస్తాయి.
- ప్రియా స్వీట్ కార్న్ ఈ రకం 30-35 వేల పచ్చి కండెలు దిగుబడి వస్తుంది. పంట కాలం 70-74 రోజులు తీపి కండె రకం 30-35% చక్కెరతో ఉడికించి తినుటకు అనువైనవి . కండె పరిమాణం మాధురి రకం కంటే పెద్దదిగా ఉంటుంది.
Also Read: Sweet Corn Cultivation: తీపిజొన్న సాగులో పాటించవలసిన ముఖ్యమైన మెళకువలు.!
Must Watch:
Also Watch:
Leave Your Comments