వ్యవసాయ పంటలు

Vegetable Cultivation: వేసవిలో తీగజాతి కూరగాయల సాగులో మెళుకువలు.!

1
Ivy Gourd Cultivation
Ivy Gourd Profits

Vegetable Cultivation: ప్రపంచంలో పండించే కూరగాయల్లో తీగజాతి పందిరి కూరగాయలను చాలా ఎక్కువగా పండిస్తారు. తీగజాతి కూరగాయలు నేలపై లేదా పందిరి మీదకు పాకే గుణం కలిగిన ఏకవార్షిక పంటలు. పందిరిపైకి పాకిస్తే నాణ్య మైన దిగుబడి పొందవచ్చు. వీటిలో ఆడ, మగ పూలు వేర్వేరుగా ఒకే మొక్కలో ఉండటం వల్ల పిందె కట్టడానికి పరపరాగ సంపర్కం అవసరం. దీని కోసం కీటకాలు ముఖ్యంగా తేనెటీగలు అవసరం. ఈ జాతి కూరగా యల్లో కాయలు లేదా పండ్లు వివిధ ఆకృతులు, పరిమాణంలో ఉంటాయి. ముఖ్యంగా గుమ్మడిలో కాయలు అతి పెద్ద పరిమాణంలో ఉంటాయి.

కాకర, బీర, సొర, పొట్లలో కాయలు ఎదిగి లేతగా ఉన్నప్పుడు కూరగాయగా వాడితే గుమ్మడి, బూడిద గుమ్మడి కాయలు పండిన తర్వాత కూరగాయగా ఉపయో గిస్తారు. పుచ్చ, కర్బూజ పంటలు ఇదే కుటుంబానికి చెందినవైనప్పటికీ కాయలు పక్వానికి వచ్చిన తర్వాత పండుగా ఉపయోగిస్తారు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ తక్కువగా ఉండటం, వేడిగాలుల వల్ల కూరగా యల సాగుకు ప్రతిబంధకాలవుతాయి. కావున మేలైన యాజమాన్య పద్ద తులు పాటిస్తే అధిక దిగుబడి పొందవచ్చు.

వాతావరణం: తేమతో కూడిన వేడి వాతావరణం అనుకూలం. ఉష్ణోగ్రత 25-30 డి. నెం. గ్రే. ఉంటే తీగ పెరుగుదల బాగా ఉండి పూత, పిందె బాగా పడుతుంది. గింజ మొలకెత్తటానికి 25-30 డి. సెం.గ్రే. ఉష్ణోగ్రత అవసరం. రాత్రి ఉష్ణో |గ్రత 18-22 డిగ్రీలు, పగటి ఉష్ణోగ్రత 30-35 డిగ్రీల సెం.గ్రే. అనుకూలం. ఉష్ణోగ్రత ఎక్కువైతే మగపూల సంఖ్య ఎక్కువై దిగుబడి తగ్గుతుంది. ఈ పంటలు వేసవి, వర్షాకాలంలో సాగుకు అనుకూలం.

నేలలు: నీటిని నిలుపుకునే తేలికపాటి ఎర్రగరప, బంకమట్టి నేలలు, ఉద జనిసూచిక 6-7 మధ్య ఉన్న నేలలు, మురుగునీటి వసతిగల ఒండ్రునేలలు అను కూలం. ఉదజని సూచిక 5.5 కంటే తక్కువుండే ఆమ్ల నేలలు పనికిరావు.

విత్తే సమయం:

వేసవి పంటగా సాగుచేసేందుకు ఆయా పంటకాలపరిమితి, అధిక ఉష్ణోగ్ర తను తట్టుకునే సామర్థ్యాన్ని బట్టి విత్తుకోవాలి. సొర, దోస, కాకరను జన వరి రెండోపక్షం నుంచి ఫిబ్రవరి చివరివరకు, గుమ్మడి, పొట్లను డిసెంబరు నుంచి జనవరి చివరి వరకు, బీర, బూడిదగుమ్మడిని డిసెంబరు రెండోపక్షం నుంచి ఫిబ్రవరి చివరి వరకు విత్తుకోవడం మంచిది. రైతులు మార్చి నెలలో కూడా విత్తి ఈ పంటల్ని సాగుచేస్తుంటారు.

దొండ కాండపు ముక్కలను సాధారణంగా జూన్-జులై చివరివరకు నాటు కోవచ్చు. చలి తక్కువగా ఉండే కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఏడాది పొడవునా నాటుకోవచ్చు.

Also Read: Ginger Crop Cultivation: వేసవి అల్లం సాగులో మెళుకువలు.!

Ridge Gourd Cultivation

Ridge Gourd Cultivation

విత్తే పద్ధతి: భూమిమీద పాకించే పాదులకు నీటిపారుదలకు బోదెలు చేయాలి. అన్నిరకాల పాదులకు 3 విత్తనాలను 1-2 సెం. మీ. లోతులో విత్తాలి. దొండపంటకు చూపుడు వేలు మందం గల కొమ్మలు 4 కణుపులు గలవి పాదుకు 2 చొప్పున నాటుకోవాలి. నాటుకునే సమయంలో అతితక్కువ ఉష్ణోగ్రతలు గల ఎత్తైన ప్రదేశాల్లో రక్షిత పద్ధతిలో 15-10 సెం. మీ. కొలతలు గల పాలిథీన్ సంచుల్లో విత్తుకొని, 20-25 రోజులు పెరిగిన తర్వాత అదను చూసి ప్రధానపొలంలో నాటుకోవాలి.

ఒక కిలో విత్తనానికి 5గ్రా ఇమిడాక్లోప్రిడ్, 3గ్రా థైరమ్ లేదా కాప్టాన్తో ఒకదాని తర్వాత మరొకటి కలిపి విత్తనశుద్ధి చేయాలి. ఆ తర్వాత 100 గ్రా., విత్తనానికి 2గ్రా. చొప్పున ట్రైకోడెర్మావిరిడి అనే జీవ శిలీంద్రనాశనితో విత్తనశుద్ధి చేయాలి. విత్తనశుద్ధి వల్ల విత్తనం ద్వారా విత్తిన తర్వాత 25 రోజుల వరకు మొక్కను ఆశించే పురుగులు, తెగుళ్ళ నుంచి కాపాడుకోవచ్చు.

పొలం తయారీ:

విత్తటానికి ముందు ప్రధాన పొలాన్ని మెత్తటి దుక్కి చేయాలి. ఆ తర్వాత పండించే విధానాన్ని బట్టి బోదెలు లేదా బెడ్లను తయారుచేయాలి. నీటిని బోదెల ద్వారా పెట్టే పద్ధతిలో సిఫార్సుచేసిన దూరంలో బోదెలను తయారుచేసి బోదె అంచు వెంట మధ్యలో విత్తనాన్ని నాటాలి. డ్రిప్పద్ధతిలో నీరిచ్చే క్రమంలో బెడ్లు తయారుచేసి డ్రిప్ పైపులను పరచి సిఫార్సు చేసిన దూరంలో నాటాలి. పాలిథీన్ మల్ను పరిచే పద్ధతిలో డ్రిప్ పైపులను బెడ్మధ్యలో ఉండేలా మల్చిషీట్ పరచి షీట్ప్ఫై సిఫార్సు చేసిన దూరంలో రంధ్రాలు చేసి విత్తుకోవాలి.

ఎరువుల యాజమాన్యం:

ఎకరాకు 8-10 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువు లేదా ఒక టన్ను వర్మికంపోస్టు, 32-40 కిలోల భాస్వరం, 16-20కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను విత్తేముందు నేలలో కలపాలి, 32-40 కిలోల నత్రజని రెండు సమపాళ్ళుగా చేసి విత్తిన 25-30 రోజులకు, పూత, పిందె దశలో వేయాలి. తీగజాతి కూర గాయల్లో మొక్కకు దగ్గరలో ఎరువు వేయకూడదు. ఎరువులను వేసిన వెంటనే మట్టిని కప్పి నీటిని పెట్టాలి. ఎక్కువ కాలపరిమితి గల గుమ్మడి, బూడిద గుమ్మడి వంటి పంటలకు సేంద్రియ ఎరువులను ఎక్కువ మోతా దుల్లో గుంతల్లో నింపి విత్తుకుంటే కాయ పరిమాణం పెరుగుతుంది.

కలుపు నివారణ:

కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. ఎకరాకు 1.2 లీటర్ల పెండిమిథాలిన్ ను 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 24-48 గంటల్లోపు తడి నేలపై పిచికారి చేయాలి.

Also Read: Solar Dryers: సౌరశక్తితో పనిచేసే పరికరాలు.!

Must Watch:

Leave Your Comments

Ginger Crop Cultivation: వేసవి అల్లం సాగులో మెళుకువలు.!

Previous article

Woman Farmer Success Story: అప్పుల ఊబి నుంచి అదనపు ఆదాయాన్ని గడిస్తున్న మహిళ.!

Next article

You may also like