Sunflower: ప్రస్తుత కాలంలో పొద్దుతిరుగుడు నునే వినియోగం ఎక్కువ అయ్యి మద్దతు పెరగడం వల్ల వీటి సాగు చెయ్యడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. పొద్దు తిరుగుడు పంట అన్ని కాలాలకు అనువైన పంట కావున నేల సిద్ధం చేసుకునే విధానంలో చాల వెత్యాసాలు ఉంటున్నాయి. కరిఫ్ సీజన్ లో ఈ పంట వేస్తున్నపుడు, నేలని 2-3 సార్లు దున్నుకుని ఎకరానికి 3-4 టన్నుల పశువుల ఎరువును వేసి కలియదున్ని వేసవిలో దుక్కిని ఎండబెట్టుకోవాలి.
కరిఫ్ లో వరి పంట తరువాత రబీ పంటగా పొలం మడులలో నీటితో తడిపి విత్తనాలను నాటడం జరుగుతుంది. డ్రిప్ పద్ధతిలో ముందుగా నేలను సమతరంగా చేసుకొని డ్రిప్ పైపుకి రెండు వైపులా విత్తనాలను నటుకోవడం మరో పద్దతిగా చెప్పుకోవచ్చు.
ఒక్క ఎకరానికి 2 నుండి 2.5 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. విత్తనాన్ని విత్తుకునే ముందు విత్తనశుద్ధి చేసుకోవడానికి కిలో విత్తనానికి 5 మీ.లీ. ఇమిడాక్లోప్రిడ్ లేదా 1 కిలో విత్తనానికి 3 గ్రాముల తైరాన్ని కలుపుకొను విత్తుకోవడం వల్ల నేల నుండి వచ్చే తెగుళ్లను, విత్తనాన్ని నాశనం చేసే కీటకాలను చాలావరకు నివారించవచ్చు. విత్తనాల మధ్య సాలుల మధ్య దూరం 60 సెంటిమీటర్లు (2 అడుగులు), మొక్కల మధ్య దూరం 30 సెంటిమీటర్లు దూరంలో ఉండేలా చూసుకోవాలి.
Also Read: క్యాలిఫ్లవర్ పంట యొక్క పూర్తి వివరాలు
పరాగసంపర్కం జరగడానికి తేనేటిగాలు ఎంతగానో సహకరిస్తాయి కావున పుష్పించే సమయంలో హానికరమైన రసాయన పురుగు మందులను పిచికారి చెయ్యకూడదు. ఉదయం 7 – 10 గంటల సమయాల్లో సున్నితమైన మెత్తని వస్త్రంతో పువ్వు మీద రుద్దాలి. వారం రోజులకి ఒక్కసారి చెయ్యడం వల్ల ఫలదీకరణం సక్రమంగా జరిగి గింజ నాణ్యత పెరుగుతుంది.
పోద్దితిరుగు పంట (Sunflower) లో తెగుళ్ల కంటే పక్షుల వల్ల జరిగే నష్టమే ఎక్కువగా ఉంటుంది. పొద్దు తిరుగుడు పువ్వు మీద పచ్చి కోడి గుడ్ల నీలాన్ని రెండు లీటర్ల నీటికి ఒక్క గుడ్డు చొప్పున కలుపుకొని వారం రోజులకు పిచికారి చేసుకోవాలి.
విత్తనం వేసేముందు భూమిలో తేమ ఉండేలా చూసుకోవాలి. కరిఫ్ లో వేస్తె నీటి శతం అంతగా ఉండక పోవచ్చు కానీ రబీ, వేసవి పంటగా వేసినప్పుడు నీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. 7- 10 రోజులకు ఒక్కసారి నీటి తడులను అందించాలి. పుష్పించే దశ నుండి గింజ బలపడేవరకు నేలలో తేమ తగ్గకుండా నీటిని పారించాలి.
విత్తనం వేసిన 2 రోజులలోపు పెండిమిదలిన్ 5 మీ.లీ ఒక్క లీటర్ నీటిలో కలుపుకొని వ్యతిరేఖ దిశలో పిచికారి చేసుకోవాలి. విత్తనం మొలకెత్తిన తరువాత గుంటుక నాగలి లేదా కలుపు నాగలితో దున్నుకోవాలి. మొక్కల మధ్య మిగిలిన కలుపు మొక్కలను సంప్రదాయ పద్దతి మనుషుల సాయంతో కలుపు తొలగించాలి. మొగ్గ తొడిగే వరకు కలుపు లేకుండా వెంటవెంటనే తొలగించాలి.
ప్రతి పంట సమృద్ధి ఎదుగుదలలో సరైన సమయానికి పోషక ఎరువులను అందించడం చాలా ముఖ్యం. నత్రజనిలో 25 శాతం పోటాష్ ని కలుపుకొని పంట 30 రోజుల ఉన్నప్పుడు మళ్ళి మొగ్గ తొడిగే సమయాల్లో వెయ్యాలి. నెక్రోసిస్ వైరస్ మొగ్గ దశలో మొక్కకు ఆశిస్తుంది. నెక్రోసిస్ వైరస్ వచ్చిన మొక్క ఎదుగుదల ఆగిపోయ్యి మొక్క క్షీనించడం జరుగుతుంది. ఒక్క ఎకరానికి స్పైనోశాడ్ 60 మీ.లీ కలుపుకొని పిచికారి చేసుకోవాలి.
Also Read: ఉల్లినారు మొక్క నాటుకునే చిట్కాలు, కలుపు, తెగులు నివారణలు.!