వ్యవసాయ పంటలు

Special Measures for Mango Cultivation: మామిడిలో ప్రతి సంవత్సరం కాత రావడానికి చేపట్టవలసిన ప్రత్యేక చర్యలు.!

1
Flowering and fruit of Mangifera indica or Mango tree
Flowering and fruit of Mangifera indica or Mango tree

Special Measures for Mango Cultivation: పంట కోత తర్వాత మామిడి మొక్కలు చాలా శక్తిని పండ్ల ద్వారా (కార్బోహైడ్రేట్లు, నీరు) కోల్పోవుట వలన, జూన్, జూలై మాసములలో చెట్లు చాలా బలహీనంగా, పెరుగుదల లేకుండా నిద్రావస్థ దశలో ఉండి చెట్లలో ఎండు కొమ్మలు కూడ కనిపిస్తాయి. నీటి వసతి లేని తేలికపాటి నేలలలో మరియు నేలలోతు తక్కువగా ఉన్న భూములలో, నేలలో బండరాయి ఉన్నప్పుడు, నీటి ఎద్దడి కారణంగా మామిడి చెట్లు బెట్టకు గురి అయి, ఆకులు పసుపు వర్ణముగా మారి, చిన్న చిన్న కొమ్మలు ఎండిపోయి కాలినట్లుగా అగుపిస్తాయి.

Special Measures for Mango Cultivation

Special Measures for Mango Cultivation

Also Read: Precautions After Mango Planting: మామిడి మొక్కలు నాటిన తర్వాత రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!

కొన్ని సార్లు చెట్లుకూడా ఎండిపోయే అవకాశం వుంది. అంతేకాకుండా చెట్లు బలహీనమై దిగుబడిని తక్కువగా ఇస్తూ, కాపును కూడా రెండు సంవత్సరాల కొకసారి ఇస్తూ, ఎండు పుల్లలు చెట్టులో అధికమై ముదురు చెట్లు చనిపోవును. ప్రతి సంవత్సరము మంచి కాపు, ఆదాయాన్ని పొందడంతోపాటు, కాపుకానీ ముదురు చెట్లు ఎక్కువ సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలంటే తోటలపై వచ్చే ఆదాయములో 10 శాతమును తోటల యాజమాన్యంకై (ఎరువులు, పురుగు మందులు, దుక్కి, నీటివసతి, కూలీలు) ఖర్చు పెట్టి సకాలంలో ఈ క్రింద కనపరచిన విధముగా శ్రద్ధ తీసుకొన వలెను.

Flowering and fruit of Mangifera indica or Mango tree

Flowering and fruit of Mangifera indica or Mango tree

సాధారణముగా ముదురు తోటలలోని చెట్లు, లేత తోటల కన్నా ఆలస్యముగా పూతకు వచ్చి కాపుకు కూడ ఆలస్యముగా వస్తాయి. అయితే బాగా శ్రద్ధ తీసుకొన్న ముదురు తోటలలోని చెట్లు, యాజమాన్య పద్ధతులను సరిగా పాటించని తోటల కంటే ముందుగా కోతకు వచ్చును. ముందుగా కోతకు వచ్చినప్పుడు మంచి రేటు లభించును అంతేగాకుండా ముదురు చెట్లపైన కోత దశకు వచ్చిన కాయలను పరిపక్వదశకు రాకముందే కోయవలెను. వండిన కాయలను చెట్లపై ఆలస్యముగా కోసినట్లయితే చెట్లు ఎక్కువ శక్తిని కోల్పోయి బలహీనమై ఎక్కువ ఎండు పుల్లలు పడతాయి.

పాటించవలసిన యాజమాన్య పద్దతులు

కోత దశకు వచ్చిన కాయలను పరిపక్వ దశ (మాగిన దశ / పండు దశ ) కు వచ్చే వరకు ఆగకుండా త్వరగా చెట్టు నుండి కోయాలి.

కోత కోసిన వెంటనే జూన్ మాసంలో నిద్రావస్థ దశలో ఉన్న చెట్లపై 1 శాతం యూరియా ద్రావణాన్ని (10 గ్రా. యూరియా/లీ. నీటికి) మరియు 0.5 శాతం జింక్ సల్ఫేటుతో (5గ్రా./లీ. నీటికి) కలిపి పిచికారి చేసినట్లయితే త్వరగా చెట్లు కొలుకొని క్రొత్త చిగుర్లు పెట్టును. ఒక శాతం చక్కెర ద్రావణముతో కూడా మంచి ఫలితాలు పొందవచ్చు.

నీటి వసతి ఉన్న తోటల్లో జూన్ మాసంలో నీటి తడిని ఇచ్చినట్లయితే వెంటనే మొక్కలు నీటి ఎద్దడి నుండి తేరుకొంటాయి.

 Measures for Mango Cultivation

Measures for Mango Cultivation

వర్షాలు పడిన తర్వాత జూలై మాసములో ప్రతి సంవత్సరము చెట్లపై ఉన్న ఎండు కొమ్మలు, రోగమున్న కొమ్మలు, భూమిని అనుకొన్న కొమ్మలు, అద్దదిద్దమైన కొమ్మలను కత్తిరించాలి. అప్పుడపుడు వీటితోపాటు ఎక్కువ వయసున్న చెట్లలో మధ్య కొమ్మలను (సెంటర్ ఓపన్ చేయుట), లోపలి కొమ్మలను కొన్నింటిని తొలగించుట వలన ఎండ, గాలి బాగా తగిలి, ఆహారము తయారు చేసుకొని, కొత్త కొమ్మలు వచ్చి అధిక దిగుబడులను ఇచ్చును దీనినే పునరుద్ధరణ అంటారు.

కత్తిరి, పులు చేసిన తర్వాత మైలతుత్తం ద్రావణాన్ని (5 శాతం) కొమ్మలకు పూసి, కాపర్ ఆక్సిక్లోరైడ్ ద్రావణాన్ని (3గ్రా/లీటరు నీటికి) చెట్లపై పిచికారి చేయాలి ఎందుకొమ్మలలో రోగాన్ని నష్టాన్ని కలుగచేసే శిలీంద్రాలు, పురుగులు ఆశ్రయం పొందుట వలన కత్తిరించిన ఎండు కొమ్మలను కాల్చి వేయవలెను. గత సంవత్సర కాపు కాసి కొమ్మల చివర్లను కత్తిరించడం వలన అక్కడ నుంచి ఎక్కువ కొమ్మలు వచ్చి అధిక దిగుబడికి దోహదపడుతుంది.

ఒకటి లేక రెండు వర్షాలు పడిన తర్వాత, తోటలలో వాలుకు అడ్డముగా చెట్ల మధ్యన దున్నాలి. దీని వలన వర్షపు నీరు భూమిలో ఇంకిపోవును మన తోటలోని వర్షం నీటిని బయటికి పోనివ్వరాదు.

ముదురు చెట్లలో అంతరపంటలుగా అల్లం, పసుపు పెంచుకొనవచ్చు. లేత తోటలలో పిల్లిపెసర, జనుము, మినుము లాంటి పైర్లను చెట్ల మధ్యన పెంచి వర్షా కాలములో భూమిలో కలియదున్నాలి. దీని వలన కలుపు అరికట్టబడటంతో పాటు భూమి కూడ సారవంతము అవుతుంది.

Also Read: Mango Plant Protection: మామిడిలో సమగ్ర సస్యరక్షణ.!

Leave Your Comments

PJTSAU: పిజెటిఎస్ ఎయూలో ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ డిజిటల్ అగ్రికల్చర్ కార్యక్రమం.!

Previous article

Pongamia Pinnata Uses: కానుగ సాగుతో ఉపయోగాలు.!

Next article

You may also like