Sesame Crop: వర్షాకాలంలో దీర్ఘకాలిక పంటలు అనగా ప్రత్తి, ఆముదం లేక కంది కోత కోసిన తరువాత, పంటలు ఆలస్యంగా వేసి కోత కోసిన పరిస్థితులలో మరియు వరి మాగాణుల్లో వరి తరువాత నువ్వు పంటను రెండవ పంటగా జనవరి ఫిబ్రవరి మాసాల్లో విత్తుకొని, తక్కువ సమయంలో తక్కువ వనరులతో అధిక నికర లాభం పొందవచ్చు.
ఈ పంట తక్కువ కాల పరిమితి అంటే 80 నుండి 90 రోజుల్లో చేతికి వస్తుంది. కేవలం 250 నుండి 300 మి.మీ. నీరు మాత్రమే అవసరమవుతుంది. అనగా ఒక ఎకరా వరి పండించే నీటితో 4 నుండి 5 ఎకరాలు మరియు ఒక ఎకరా మొక్కజొన్న పండించే నీటితో 2 నుండి 2.5 ఎకరాల నువ్వు పంటను పండించవచ్చు.
• వరి కోతానంతరం వివిధ పంటలను పండించి చూసినప్పుడు వేరుశనగ (రూ. 24,912/హె, 1.51) మరియు ఆముదం (రూ.26,428/హె; 1.72) పంటలతో పోలిస్తే నువ్వు పంట నుండి అధిక నికర ఆదాయం రూ.33,440/హె. మరియు ఆదాయం ఖర్చు నిష్పత్తి (2.56) లభించాయి. అదే విధంగా మార్కెట్లో ధర రూ.5000 – 8000 క్వి ఉండటం వలన వేసవిలో నువ్వు సాగు ఎంతో లాభదాయకం.
పైన పేర్కొన్న కారణాల వలన నువ్వు వంట రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ప్రాచుర్యం పొందుటకు అవకాశం ఎక్కువ అని చెప్పవచ్చు. వేసవిలో మేలైన యాజమాన్య పద్ధతులను పాటించి, నువ్వు పంట నుండి అధిక దిగుబడి మరియు ఆదాయం పొందవచ్చు.
Also Read: Turmeric Crop: ఉడికించిన పసుపు దుంపలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!
* ఆశ్వేత, హిమ, రాజేశ్వరి అనే తెల్ల గింజ రకాలు, చందన, గౌరి అనే గోధుమ రంగు గింజ రకాలు సాగు చేసుకోవచ్చు.మురుగు నీరు నిలువని తేలికైన నేలలు ఈ పంటకు అనుకూలం. నేలను మెత్తగా దున్ని రెండుసార్లు గుంటక తోలి చదును చేసుకోవాలి.
• ఎకరాకు 2.5 కిలోల విత్తనం తీసుకొని 3 గ్రా. మాంకోజెల్ అనే శిలీంధ్రనాశినితో విత్తనశుద్ధి చేసుకోవాలి. ఈ విత్తనానికి 7 నుండి 7.5 కిలోల సన్నని ఇసుకను కలిపి వరుసల మధ్య 30 సెం.మీ. (12 అంగుళాలు) ఉండేటట్లు గొర్రుతో వరుసల్లో విత్తుకోవాలి. మొక్కలు వత్తుగా ఉన్నట్లయితే 15 రోజుల తరువాత మొక్కల మధ్య 15 సెం.మీ. ఉండేటట్లుగా చూసుకొని మిగతా మొక్కలను తీసివేయాలి.
* ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు, 35 కిలోల యూరియా, 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి.
* విత్తిన 30 మరియు 50. రోజుల దశలలో మరో 18 కిలోల యూరియా పైపాటుగా వేసుకోవాలి.
• విత్తిన వెంటనే పలుచగా తడి ఇవ్వాలి. పూత, కాయ అభివృద్ధి మరియు గింజ కట్టు దశలలో నీటి తరులు తగు మోతాదులో ఇవ్వాలి. విత్తిన 20 నుండి 25 రోజులకు మరియు 35 నుండి 40 రోజులకు ఒకసారి చేతితో లేదా దంతి సహాయంతో కలుపు లేకుండా చూసుకోవాలి.
Also Read: Ladies finger and Cabbage: బెండ మరియు క్యాబేజీలో సస్యరక్షణ.!