జొన్న మొవ్వు ఈగ:-
ఈ పురుగు విత్తనాలు మొలకెత్తినది మొదలు 30 రోజుల వరకు పైరును ఆశిస్తుంది. ఇది పంటకు తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తుంది. దీని ఉదృతి ఆలస్యo గా విత్తుకున్న పంటలో ఎక్కువగా గమనించగలరు. గుడ్ల నుండి బయటకు వచ్చిన పిల్ల పురుగులు ఆకుపై భాగానికి పాకీ క్రమంగా లేత మువ్వలోని భాగాలను గోకి తినడం వల్ల మొవ్వు వాడిపోతుంది. ఎండిన మొవ్వును లాగినపుడు సులువుగా పైకి వచ్చి మొదలు కుళ్ళి ఉండి చెడు వాసన వస్తుంది. మొక్కలు గిడస బారిపోయి పురుగు ఆశించిన మొక్క మొదలు వద్ద గుబురుగా పిలకలు వస్తాయి. కానీ వాటికీ కంకులు రావు.
Also Read: Pest Management in Sorghum: జొన్నను ఆశించు తెగులు – వాటి నివారణ
కాండం తొలుచు పురుగు:-
ఇది పంట పై 30రోజుల నుండి పంట కోసే వరకు ఆశిస్తుంది. గుడ్ల నుండి బయటకు వచ్చిన పిల్ల పురుగు మొవ్వు దగ్గరకు చేరి లేత ఆకులు తినడం వల్ల ఆకులపై రంద్రాలు ఏర్పడతాయి. తరువాత ఇవి మొవ్వులోకి ప్రవేశించి లోపల భాగాన్ని తినడం వల్ల మొవ్వు అనేది చనిపోతుంది. కాండాన్ని చీల్చి చూస్తే ఎర్రని కణజాలంతో పాటు పురుగు యొక్క వివిధ దశలు కనిపిస్తాయి. కంకులు ఎర్పడిన తరువాత కూడా కంకి తోడిమాలను ఆశిచడం వల్ల కంకులు విరిగి పోయి గింజలు పట్టవు.
చిగురునల్లి:-
వీటి పిల్ల, పెద్ద పురుగులు గుంపులుగా ఆకులు మీద, ఆకు తొడిమల్లో, మొవ్వు ఆకు లోపల నుండి రసాన్ని పీలుస్తాయి. దీని వల్ల మొక్కలు గిడసబారి పసువు రంగుకు మారతాయి. వీటి వృద్ధి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులపై నుండి కిందకి ఎండిపోయి చనిపోతాయి. ఇవి స్త్రీపే అనే వైరస్ ను వ్యాప్తి చేస్తాయి.
పేనుబంక:-
పిల్ల, తల్లీ పురుగులు ఆకు పచ్చ వర్ణం కలిగి ఆకులు లేతకంకుల అడుగు భాగం నుండి రసం పీల్చేడమే కాక తేనె వంటి జిగట పదార్థాన్ని విసర్జిస్తాయి. ఇవి ఆశించిన ఆకుల మీద పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. మొక్కల పెరుగుదల తగ్గుతుంది. పైరు తొలి దశలో పేనుబంక ఆశిస్తే కంకులు ఏర్పడవు. ఇవి మొజైక్ వైరస్ ను వ్యాప్తి చేస్తాయి.
కంకి నల్లి:-
ఈ పురుగు జొన్న కంకి పొట్ట నుండి వెలుపలికి వచ్చిన వెంటనే ఆశిస్తుంది. ఆలస్యం గా విత్తిన పంటలో దీని ఉధృతి ఎక్కువ పిల్ల పెద్ద పురుగులు కంకి పై ఆశిచి పాలు పోసుకొనే దశలో రసం పీల్చడం వలన గింజలపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. కంకుల్లో కొన్ని గింజలు తెల్లగా మారతాయి. ఈ పురుగు ఆశిచిన కంకులపై గింజ బూజు తెగులు యొక్క ఉధృతి ఎక్కువ గా ఉంటుంది.
జొన్న మిడ్జి:-
తల్లి పురుగు గింజపై గుడ్లు పెడుతుంది. గుడ్ల నుండి బయటకి వచ్చిన పిల్ల పురుగులు గింజలోనికి ప్రవేశించి లోపల భాగన్ని తిని నష్టం కలుగ జేస్తాయి.
జొన్న నల్లి:-
పిల్ల, తల్లి పురుగులు గుంపులుగా చేరి లేత జొన్న మొక్కల ఆకులు నుండి రసాన్ని పీల్చడం ద్వారా మొక్కలు బలహీనం అయ్యి కాలిపోయినట్లు కనిపిస్తుంది. ఈ పురుగు ఉదృతి ఎక్కువగా ఉన్నపుడు బలహీనమైన కంకులు వస్తాయి. చొప్ప పశువుల మేతకు పనికి రాదు.
Also Read: Integrated Nutrient Management in Sorghum: జొన్న పంటలో సమీకృత పోషక యాజమాన్యం