వ్యవసాయ పంటలు

Soils For Groundnut Cultivation: వేరుశనగ సాగుకు అనువైన నేలలు.!

2
Groundnut Cultivation
Groundnut Cultivation

Soils For Groundnut Cultivation: వేరుశనగ పొట్టిగా పెరిగే మొక్క ప్రధమ శాఖలు ఎక్కువగా ఉండి ముఖ్య సూచిక 15-40 సెం.మీ పొడవు ఉంటుంది. దీనిలో గుత్తి రకాలు, తీగ రకాలు ఉన్నాయి. తీగ రకాల్లో రెండవ శ్రేణి శాఖలు ఉద్భవించి తీగల రూపాన్ని, నేల మీద ప్రాకే స్వభావాన్ని ఇస్తాయి. ఆకులు ఒకదానితో ఒకటి ఎదురుగా ఉండి స్టిఫ్యూల్స్ పొడవుగా వుండి నాలుగు పత్రదళాలు ఉంటాయి. పుష్పాలు పసుపు పచ్చ ఆరెంజ్ రంగులో వుండి ‘పేపియోలినేసియే’ ఉప కుటుంబం ప్రతినిధిగా ఉండి కీలాగ్రం అండాశయం మీద ఉద్భవిస్తుంది.

ఇది స్వపరాగం జరుపుకునే మొక్క, ఫలదీకరణం ఉదయం సమయంలో జరుగుతుంది. పువ్వులు, ఆకులు మొదళ్ళ నుంచి ఉద్భవిస్తాయి. ఫలదీకరణం పూర్తయిన తర్వాత పువ్వులు వాడిపోతాయి. అండాశయం మొదలు నుండి కొత్త కండరాలు ఉద్భవించి పొడవాటి కాడ పెరుగుతుంది. ఇది నేలను తాకిన దగ్గర బుడిపెలాగ ఏర్పడుతుంది. దీనినే “పెగ్ లేదా ఊడ”అంటారు.

నేలను తాకిన తర్వాత: భూమికి సమతలంగా వంగి 1,2,3 లేక 4. అండాలతో కాయలు తయారవుతాయి. పంట తయారయినపుడు గింజలు కాయల్లో ఉంటాయి. విత్తనము పై పొర గులాబీ రంగులో వుంటుంది. కాని కొన్ని రకాల్లో ఎరుపు, తెలుపు, పర్పుల్ తెల్లని మచ్చలతో ఉంటుంది. నూనెగింజల పంటల్లో ఈ పంటను రారాజు పంటగా పరిగణిస్తారు.

Soils For Groundnut Cultivation

Soils For Groundnut Cultivation

Also Read: Pests and Diseases in Groundnut: వేరుశనగ తెగుళ్ళు – నివారణ.!

భారతదేశం ప్రపంచంలో వేరుశనగ విస్తీర్ణంలో మొదటి స్థానంలో ఉంది. కాని ఉత్పాదకతలో పదవ స్థానంలో ఉంది. భారతదేశంలో దీన్ని ప్రధానంగా గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకలలో ఎక్కువగా సాగుచేస్తున్నారు. విస్తీర్ణం 50%. ఉత్పత్తి 67.3% కల్గివున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాలు విస్తీర్ణం మరియు ఉత్పత్తి విషయంలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. 2017-18 గణాంకాల ప్రకారం మన రాష్ట్రములో 7.35 లక్షల హెక్టార్లలో సాగు చేయబడుతూ 10.48 ల టన్నుల కాయల ఉత్పత్తినిస్తుంది. సగటు దిగుబటి రబి 2435 కిలోలు హెక్టారుకు year average 1426 kg/ha. అనంతపురం, చిత్తూరు, కర్నూలు, మహబూబ్నగర్, కడప జిల్లాల్లో 80% విస్తీర్ణం, విజయనగరం, నల్గొండ, గుంటూరు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో 11% మిగిలిన జిల్లాల్లో 9% విస్తీర్ణం ఉంది.

నేలలు:

వేరుశెనగ ఇసుక, ఇసుక గరప (లోమి) నేలల్లో బాగా పెరుగుతుంది. ఎందుకంటే ఇవి తేలిక మృత్తికలు.ఊడలు(పెగ్స్) సులువుగా చొచ్చుకొని పోవడానికి ఉపయోగపడుతుంది. బంక నేలలు, బరువు నేలలు పనికిరావు.ఎందుకంటే ఊడలు చొచ్చుకొని పోవడానికి ఆటంకం కలిగి, కోత కష్టం అవుతుంది. తరచుగా మృత్తిక భౌతిక పరిస్థితి వల్ల దిగుబడులు పరిమితం అగును. పుష్పాలు ఫలదీకరణం చెందిన తర్వాత పెగ్ ఏర్పడుతుంది. ఇది మృత్తికలో 5 సెం.మీ లోతు వరకు చొచ్చుకొని పోయి అక్కడ కాయగా అభివృద్ధి చెందుతుంది.పెగ్ చొచ్చుకుని పోవడం, ఉపరితల మృత్తిక భౌతిక పరిస్థితివల్ల ప్రభావితం అవుతుంది. కాయ అభివృద్ధి దాని చుట్టూ వున్న మృత్తిక పరిస్థితుల మీద ఆధారపడుతుంది.

వర్షాధార వేరుశెనగ సాగులో రెండు వానల మధ్య ఎక్కువ కాలం పొడి పరిస్థితులు ఉంటే ఇసుక, బంకమట్టి నేలలు తేమ నష్టం వల్ల గట్టిబడి నేల దట్టం కావటం జరుగుతుంది. మృత్తిక బలం 3 బార్లను మించితే పెగ్ చొచ్చుకొని పోవడానికి ఆటంకం కలుగుతుంది. మృత్తిక స్థూల సాంద్రత 1.5 గ్రా/సి.సి కన్నా మించితే కాయ అభివృద్ధికి ఆటంకం జరుగుతుంది. పొడిచేసిన వేరుశనగ పెంకుల/ తొక్కలను 5 టన్నులు లేదా పెంట హెక్టారుకి 10 టన్నుల చొప్పున లేదా జిప్సమ్ హెక్టారుకు 1 టన్ను చొప్పున వేస్తే మృత్తిక భౌతిక పరిస్థితి మెరుగుపడుతుంది.

Also Read: Groundnut Seed Selection: వేరుశనగ విత్తన ఎంపికలో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు.!

Leave Your Comments

Ranikhet Disease in Poultry: కోళ్లలో కొక్కెర తెగులు ఎలా వస్తుంది.!

Previous article

Powdery Mildew in Mango and Grapes: మామిడి మరియు ద్రాక్ష తోటలో వచ్చే బూడిద తెగులు యాజమాన్యం.!

Next article

You may also like